Now a biopic on Lalu Prasad Yadav లాలు ప్రసాద్ యాదవ్ జీవితం అధారంగా బయోపిక్..

Now biopic to be made on lalu prasad yadav

bihar ex chief minister lalu prasad yadav biopic on cards bhojpuri actor yash kumar plays lalu charecter,Lalu Prasad Yadav,Lalu Prasad Yadav biopic,Lalu Prasad Yadav latest news,lalu prasad yadav instagram,lalu prasad yadav twitter,lalu prasad yadav facebook,lalu prasad yadav yash,yash kumar plays lalu prasad yadav charecter,ntr,pm narendra modi,jabardasth comedy show,bigg boss final,biopic on Lalu Prasad Yadav,lalu biopic,lalu latest news,bihar lalu news, bihar politics

The trend of making biopics is a successful mantra in Bollywood, noa a film is going to be made on former Bihar Chief Minister Lalu Prasad Yadav, who is serving a sentence in the fodder scam. Bhojpuri actor Yash is playing the role of lalu and the title of the movie is anything other than Lantern.

లాలూ ప్రసాద్ యాదవ్ జీవితం అధారంగా బయోపిక్..

Posted: 10/31/2019 05:27 PM IST
Now biopic to be made on lalu prasad yadav

ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగంలో బయోపిక్స్ ట్రెండింగ్ చేస్తున్నాయి. వివిద రంగాలలోని ప్రముఖల జీవిత విశేషాలను ప్రేక్షకులకు సునాయాసంగా.. కాసింత మాస్ మసాలా కలసి చూపడంలో సినీ దర్శకులు విజయవంతం కావడంతో ఇక బయోపిక్ లు ప్రేక్షకాధరణ పోందుతూ విజయవంతం అవుతున్నాయి. అటు క్రీడారంగం మొదలుకుని చలనచిత్ర రంగం, రాజకీయ రంగం ఇలా అన్ని రంగాల్లోని ప్రముఖులను ఎంచుకుని వారి జీవితాల్లోని ముఖ్యఘట్టాలు, కష్టనష్టాలు, అకుంఠిత దీక్ష, పట్టుదల, క్రమశిక్షణ ఇత్యాదులతో చిత్రాన్ని రూపోందిస్తున్నారు. ఈ కోవాలో దేశ ప్రజలపై తమదైన ముద్ర వేసిన రాజకీయ నేతల జీవితాలను వెండితెరపై ఆవిష్కరించడం ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది.

కొందరి సినీ రాజకీయ నేతలుగా ఎదిగిన వారిపై ఏకంగా రెండు సినిమాలు తెరకెక్కాయి. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలోని తాజా, మాజీ ప్రధాన మంత్రుల జీవితాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో తమదైన ముద్ర వేసిన ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించి డజను పైగా చిత్రాలు వెండితెరపై కనువిందు చేసాయి. ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ప్రధానమంత్రిగా ఉన్నకాలం నేపథ్యంలో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా తెరకెక్కింది. మరోవైపు ప్రదానమంత్రి నరేంద్రమోదీ జీవిత చరిత్రలపై ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా.

ఇక ఎన్టీఆర్, వైయస్ఆర్ సినిమాలు వెండితెరపై కనువిందు చేసాయి. త్వరలో జయలలిత జీవితంపై మూడు నాలుగు బయోపిక్‌లు రానున్నాయి. తాజాగా ఒకపుడు బీహార్‌ను తను కనుసైగలతో పాలించిన లాలూ ప్రసాద్ యాదవ్ జీవిత చరిత్రపై సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘లాంతర్’ అనే టైటిల్ ఖరారు చేశారు. లాలూ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ గుర్తు కూడా లాంతర్ కావడం విశేషం. ఈ సినిమాలో లాలూ ప్రసాద్ యాదవ్ క్యారెక్టర్‌ను ప్రముఖ భోజ్‌పురి నటుడు యష్ కుమార్ నటిస్తున్నారు. లాలూ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి పాత్రలో స్మృతి సిన్హా నటించనున్నారు.

లాలూ బయోపిక్‌ను బీహార్, గుజరాత్‌లో షూటింగ్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తామని కుమార్ తెలిపారు. దేశ రాజకీయాల్లో లాలూ ప్రసాద్ యాదవ్ స్టైలే వేరు. ఆయన భాష, యాస, మాటలు ప్రజలను ఆకర్షితులను చేస్తాయి. ఆయన జీవన విధానం కూడా భిన్నంగా ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా.. రోజూ ఉదయాన్నే షెడ్లో ఆవులకు పాలు పిండడం వంటి పనులు చేసి వార్తల్లో నిలిచారు. దాణా కుంభకోణంలో ఆయన జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆయన తన సతీమణి రబ్రీదేవిని బిహార్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు.

జబ్ తక్ సమోసేమే ఆలూ తబ్ తక్ బీహార్‌లో లాలూ అనేది ఆయన నానుడి. అంటే సమోసాలో ఆలూ ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు ఆయన బిహార్‌లో ఉంటాడనేది ఈ సామెత సారాంశం. గత బిహార్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకొని మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు . లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ శిష్యుడిగా  స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన లాలూ ప్రసాద్ యాదవ్.. బీహార్ సీఎంగా ఎదిగారు. ముఖ్యంగా బిహార్‌లో యాదవుల్లో లాలూకి ఉన్న ఫాలోయింగ్ ఈ తరం వారికి తెలియజెప్పేందుకే ఈ సినిమాను తీస్తున్నట్టు యష్ కుమార్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles