TDP one day Deeksha over Sand shortage ఇసుక కొరతపై గుంటూరులో టీడీపీ దీక్ష

Nara lokesh hunger strike in guntur over sand scarcity in andhra pradesh

heavy rains, TDP leaders, Hunger Strike, TDP Deeksha, Sand Crisis, Nara Lokesh, Guntur M.P. Galla Jayadev, Nakka Anand Babu, TDP, YSR congress, Congress, Andhra Pradesh, Politics

Telugu Desam party national general Secretary and MLC Nara Lokesh embarked on 'Nirasana Deeksha' on Wednesday in protest against the scareity of sand which halted the construction activity, depriving lakhs of workers of livelihood.

ఇసుక కొరతపై గుంటూరులో నారా లోకేష్ నిరాహార దీక్ష

Posted: 10/30/2019 03:44 PM IST
Nara lokesh hunger strike in guntur over sand scarcity in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక దుమారం కొనసాగుతోంది. ఇసుక కొరత వల్ల నిర్మాణపు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో భవననిర్మాణ కూలీ ఆత్మహత్య కలకలం రేపింది. ఇసుక కొరతపై ప్రతిపక్ష టీడీపీ పోరుబాట పట్టింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఇసుక కొరత నెలకొందని ఆరోపిస్తోంది. ఇసుక కొరతను నిరసిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఒకరోజు దీక్ష చేపట్టారు. ఉదయం ప్రారంభమైన ఈ ధీక్ష.. సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది.

నారా లోకేష్ దీక్షకు సంఘీభావంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి లోకేష్ దీక్షలో కూర్చున్నారు. ఇసుక ప్యాకెట్లను దండలుగా వేసుకుని టీడీపీ నేతలు దీక్షకు దిగారు. నారా లోకేష్ మెడలో నల్లకండువా కప్పుకుని నిరసన తెలియజేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, స్థానిక ఎమ్మెల్యే మద్దాలి గిరి, మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు ఆయనకు సంఘీభావంగా దీక్షల్లో కూర్చున్నారు. పెద్దఎత్తున తరలివచ్చిన టీడీపీ శ్రేణులతో గుంటూరు కలెక్టరేట్ పరిసరాలు కిటకిటలాడాయి.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తూనే గత ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసింది. నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. జగన్ సర్కార్ తెచ్చిన నూతన విధానంతో రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రతరమైంది. గత కొద్ది నెలలుగా ఇసుక లభించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురించాయని ప్రతిపక్ష టీడీపీ ఆరోపిస్తోంది.

గతంలో ఇసుక ట్రాక్టర్ ధర రూ.2 వేల లోపు ఉండేదని, ఇప్పుడు అది రూ.5 వేల నుంచి రూ.7 వేలకు పెరిగింది. లారీ ఇసుక ధర రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ పలుకుతోంది. రాష్ట్రంలో ఇసుక కొరత తీవ్రంగా ఉంటే పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇసుక హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు తరలిపోతోందని చెబుతోంది. ఇసుక మాఫియా రెచ్చిపోతోందని.. అధికార పార్టీ నేతలు జేబులు నింపుకునేందుకు మాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles