Tension prevails over TDP leaders house arrest ఇసుక విధానంపై టీడీపీ అందోళన.. నేతల గృహనిర్భధం..

Tension prevails over tdp leaders house arrest in bandar

Tension prevails in Koneru center, Tension prevails in machilipatnam, Tension prevails in Krishna, Tension prevails in Bandar, Tension prevails in Andhra Pradesh, Sand policy in Andhra Pradesh, TDP leaders house arrest, Kollu Ravindra, Konkalla Narayana, Bachchula Arjuna, TDP leaders, sand policy, Andhra Pradesh, Politics

Former B.C. Welfare Minister and TDP leader Kollu Ravindra announced 34 hours protest at Koneru center in Machilipatnam of Krishna district questioning the state government over the sand crisis.

ఇసుక విధానంపై యుద్దం.. టీడీపీ నేతల అరెస్టులు.. ఉద్రిక్తత

Posted: 10/11/2019 11:08 AM IST
Tension prevails over tdp leaders house arrest in bandar

మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం అలుముకుంది. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న ఇసుక కొరతను నిరసిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర 36 గంటల దీక్ష పిలుపునిచ్చారు. మాజీ మంత్రి అందోళన కార్యక్రమానికి అనుమతి లేదంటూ దానిని భగ్నం చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఇవాళ ఉదయం నుంచి మచిలీపట్నంలోని తెలుగుదేశం నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

36 గంటల దీక్షకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు, ఆయనను ఇంటి నుంచి బయటకు రానీయకుండా చర్యలు తీసుకున్నారు. టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణను కూడా హౌజ్ అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునిడిని ఇంటికే పరిమితం చేశారు. అయితే అర్జునుడిని పోలీసులు అరెస్టు చేశారన్న వార్త బయటకు రావడంతో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకోవడంతో టెన్షన్‌ మొదలయ్యింది.

దీంతో టీడీపీ నాయకులు ఎవరినీ అరెస్టు చేయలేదని, ఊహాగానాలు నమ్మవద్దని అడిషనల్‌ ఎప్పీ సత్తిబాబు ప్రకటన చేశారు. టీడీపీ, వైసీపీ పార్టీల్లో ఎవరికీ శిబిరాల ఏర్పాటుకు అనుమతించలేదని, అందువల్ల శాంతిభద్రతల పరిరక్షణకు అంతా సహకరించాలని ఏఎస్పీ కోరారు. డీఆర్పీ సమావేశం ఉన్నందున శాంతిభద్రత విఘాతానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇదిలావుండగా, పోలీసుల కళ్లుగప్పిన మాజీ మంత్రి తప్పించుకున్నారు.

కొల్లు రవీంద్ర ఇంటిచుట్టూ భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించినా ఆయన వారి కళ్లుగప్పి, కోనేరు కూడలి వద్దనున్న నిరసన ప్రాంతానికి చేరుకున్నారు. ఇంటి వెనుకవైపు నుంచి నగర నడిబొడ్డున ఉన్న కోనేరు సెంటర్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర పోలీసులు ప్రభుత్వానికి కొమ్ముగాస్తున్నారని విమర్శలు గుప్పించారు. పోలీసుల తీరును తప్పుబట్టిన ఆయన, శాంతియుతంగా ఆందోళన చేసే వారిని అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : House arrest  Kollu Ravindra  TDP leaders  sand policy  Machilipatnam  Andhra Pradesh  Politics  

Other Articles