passenger purchase rail tickets than platform tickets రైల్వే అధికారుల ఎత్తును చిత్తు చేసిన ప్రయాణికులు.!

Sale of passenger train tickets increased as platform ticket price hiked

platform tickets, price hike, festive season, passengers, train general tickets, passenger trains, railway officials

In View if festive season rush to avoid unnecessary passengers ino railway station.. railway officials had increased platform tickets cost by 200 percent, but passengers purchase passenger train tickets of RS. 10 amid platform tickets worth Rs.30.

సూపర్ ప్లాన్ తో రైల్వే అధికారుల ఎత్తును చిత్తు చేసిన ప్రయాణికులు.!

Posted: 10/03/2019 07:25 PM IST
Sale of passenger train tickets increased as platform ticket price hiked

పండగ సీజన్ వచ్చిందంటే రైల్వే అధికారులకు నిజమైన పండగ. దసరా సీజన్ ను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫామ్ టికెట్ల రేట్లు పెంచి ప్యాసింజర్ల జేబులకు చిల్లులు పెట్టడం తెలిసిందే. కాగా, గత సంవత్సరం వరకు రూ.10 టికెట్ ను రెండింతలు చేసి రూ.20 పెంచారు. అయితే సర్లే అని ఫ్లాట్ ఫామ్ టికెట్లు తీసుకున్నారు ప్రయాణికులు. అయితే ఈ పండగ సీజన్ లో ఏకంగా రూ.30కి పెంచేసి రైల్వే అధికారులు ఏకంగా ప్రయాణికులను దోపిడి చేసేందుకు రంగం సిద్దం చేశారు.

ఈ నెల (అక్టోబరు) 10 వరకు ఈ రేట్లు అమల్లో ఉంటాయని రైల్వే శాఖ ప్రకటించింది. ఉత్తి పుణ్యానికి రూ.30 చెల్లించాల్సి రావడం ఎందుకనుకున్న ప్రజానీకం.. రైల్వే అధికారులు ఎత్తుకు పైఎత్తు వేసి చిత్తు చేశారు. ప్రయాణికుల అదిరిపోయే ప్లాన్ తో రైల్వే శాఖకు షాక్ తగిలిది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు ఒక వైపు ఫ్లాట్ ఫామ్ అదాయం పోవడంతో పాటు మరోవైపు స్వల్ప దూరాలు వెళ్లాల్సిన ప్యాసింజర్ రైలు ప్రయాణికులు ఉచిత రైల్వే టికెట్లతో ప్రయాణం చేయడంతో రెండు విధాలుగా ఆదాయం పోగొట్టుకుంది. అదెలా అంటే..

రైల్వే స్టేషన్ కు వెళ్లే క్రమంలో ప్లాట్ ఫామ్ టికెట్ కు బదులు పాసింజర్ ట్రైన్ టికెట్ కొనడం మొదలుపెట్టారు. పాసింజర్ ట్రైన్ మినిమమ్ చార్జి రూ.10 కాగా, పది రూపాయలు పెట్టి పాసింజర్ టికెట్ కొని దర్జాగా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై అడుగుపెడుతున్నారు. ఈ విధంగా రూ.20 ఆదా చేస్తున్నారు. అంతేకాదు, స్టేషన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు తమ వద్ద ఉన్న పాసింజర్ టికెట్ ను ఇతరులకు ఇచ్చేస్తున్నారు.

ఇక ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్న స్టేషన్లలో ప్రయాణికులు ఐదు రూపాయల ఎంఎంటీఎస్ రైలు టికెట్లు తీసుకుని స్టేషన్లలోకి వెళ్లి తమ వారిని సంబంధిత రైళ్లలో ఎక్కించి తిరిగి వెళ్తున్నారు. ప్లాట్ ఫామ్ టికెట్ల కన్నా పాసింజర్ టికెట్ల అమ్మకాల్లో విపరీతమైన పెరుగుదల కనిపించడంతో అధికారులు ఆరా తీస్తే ఈ విషయం బయటపడింది. ఏదేమైనా రైల్వే అధికారులు ప్లాట్ ఫామ్ టికెట్ల రేట్లు పెంచేటప్పుడు ఈ చిన్న లాజిక్ మిస్సయ్యారనే చెప్పాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles