Undavalli Cautioned Jagan On Governance సీఎం జగన్ కు ఉండవల్లి హెచ్చరికలు

Former mp undavalli cautioned jagan mohan reddy on governance

Undavalli Arun Kumar, YS Jagan Mohan Reddy, MLA's Revolt, Electricity, power cuts, sand policy, administration, Rajamahendravaram, Andhra Pradesh, Politics

Former Congress Member of Parliament Undavalli Arun Kumar adviced Cheif Minister YS Jagan on his own MLA's Revolt against him. Former MP suggested CM to be alert in administration and take decisions after thinking twice or thrice.

సీఎం జగన్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరికలు

Posted: 10/01/2019 08:39 PM IST
Former mp undavalli cautioned jagan mohan reddy on governance

వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. సీనియర్ రాజకీయ నేత రాజకీయ విశ్లేషకుడి అవతారం ఎత్తారు. దీంతో ఎప్పటికప్పుడు ప్రభుత్వాల పనితీరుకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. తాజాగా రాష్ట్రంలోని పరిస్థితులపై ఆయన స్పందించారు. విద్యుత్తు కోతలతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. విద్యుత్తు కోతల నెపాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లేక కేంద్రంలోని ప్రభుత్వంపైనా.. లేక ప్రధాని మోదీపైన నెట్టినా ఉపయోగం ఉండదని, అది ప్రభుత్వంపైనే ప్రభావం చూపుతుందన్నారు.

ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు వైసీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలా జరగని పక్షంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు. జగన్ ప్రభుత్వానికి మెజారిటీ చూసుకుని శాశ్వతం అనుకోవద్దని, ఎమ్మెల్యేలను కూడా సంతృప్తి పర్చాలన్నారు. ప్రతి ఎమ్మెల్యే తనకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారని ఫీలవ్వాలన్నారు. లేకుంటే అసంతృప్తి పెరుగుతుందన్నారు. వైసీపీది జాతీయ పార్టీ కాదని, ప్రాంతీయ పార్టీ అని గుర్తుంచుకోవాలన్నారు.

జాగ్రత్తగా వ్యవహరించకుంటే మీ మనుషులే మీ మీద తిరగబడతారని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. 51 శాతం ఓట్లతో 1972లో కాంగ్రెస్ 219 సీట్లు సాధిస్తే తొమ్మిది నెలల్లోనే అప్పటి ముఖ్యమంత్రి పీవీ నరసింహారావును దింపేశారన్నారు ఉండవల్లి. అలాగే 1994లో ఎన్టీఆర్, కమ్యునిస్టులు కలసి పోటీ చేసి 54 శాతం ఓట్లతో 213 సీట్లు సాధిస్తే తొమ్మదినెలలకు ఎన్టీ రామారావును ఎమ్మెల్యేలు పదవి నుంచి దించేశారన్నారు. జగన్ కూడా ఇది గుర్తుంచుకుంటే బాగుంటుందని ఉండవల్లి పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Undavalli Arun Kumar  YS Jagan Mohan Reddy  Rajamahendravaram  Andhra Pradesh  Politics  

Other Articles