Only Pulwama attack-like situation can help BJP: Sharad Pawar బీజేపి గెలుపుపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

Only pulwama like incident can change mood of people in maharashtra says sharad pawar

Assembly polls, Maharashra assembly elections, Maharashtra Polls, Devendra Fadnavis, Narendra Modi, BJP, NCP, Congress, pakistan, sharad pawar, Maharashtra, Politics

NCP chief Sharad Pawar said there is a lot of resentment against the BJP-led government in Maharashtra, and only a Pulwama-like incident can change tpolls, his sentiment ahead of the elections.

బీజేపి గెలుపుపై శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

Posted: 09/21/2019 11:56 AM IST
Only pulwama like incident can change mood of people in maharashtra says sharad pawar

కేంద్రంలోని అధికార బీజేపి పార్టీతో పాటు రాష్ట్రంలోనూ ప్రస్తుతం అధికారంలో వున్న బీజేపి పార్టీపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ సార్వత్రిక ఎన్నికలకు ముందు పూల్వామాలో జరిగిన ఉగ్రదాడి, ఆ తదనంతర పరిణమంలో జరిగిన ఘటనలతో కేంద్రంలో బీజేపి తిరిగి అధికారంలోకి వచ్చిందని అంతేకానీ బీజేపి చేసిన ప్రజాహిత కార్యక్రమాల వల్ల మాత్రం కానే కాదని ఆయన తేల్చిచెప్పారు.

నోట్ల రద్దు, జీఎస్టీ, రైతుల మరణాలు, గోపుల పేరుతో మనుషుల ప్రాణాలు హరించడం, విభజించి పాలించే చర్యలు, కక్షపూరిత రాజకీయాలను నెరపిన బీజేపి పార్టీపై. నరేంద్రమోడీ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుండిందని.. అయితే వాటన్నింటినీ వూల్వామా ఉగ్రదాడి ఆనంతర భారత ఆర్మీ జరిపిన తదనంతర పోరాటాల ప్రతిఫలాన్ని నరేంద్రమోడీ తీసుకుని దానిని అడ్డుగా పెట్టుకుని నాలుగు మాసాల క్రితం జరిగిన ఎన్నికలలో గెలిచారని ఆయన దుయ్యబట్టారు.

ఈ క్రమంలో తాజాగా జరుగునున్న మహారాష్ట్ర ఎన్నికలలో మరో పుల్వామా తరహా ఘటన సంభవిస్తే తప్ప.. బీజేపీ-శివసేన కూటమి విజయం సాధించడం అనితరసాధ్యమని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్సీపీ జయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్, బహుజన్ వికాస్ అగాథి, సమాజ్ వాదీ పార్టీలతో కలసి కాషాయ కూటమిని ఎదుర్కొంటామని చెప్పారు. ఎన్సీపీపై ప్రజల్లో భారీ అంచనాలు ఉన్నాయని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devendra Fadnavis  Narendra Modi  BJP  NCP  Congress  pakistan  sharad pawar  Maharashtra  Politics  

Other Articles