Period apps share your fertility data with Facebook మహిళల అత్యంత గోప్యమైన విషయాలు రట్టు..

Menstruation apps shared personal data with facebook without consent

facebook, data sharing, Maya, Plackal Tech, MIA Fem, Mobapp Development Limited, facebook, facebook data sharing, facebook privacy, menstrual apps sharing data with facebook, privacy international

Privacy International reveals that popular menstruation apps like Maya by Plackal Tech and MIA Fem by Mobapp Development Limited shared the personal medical data of users with Facebook and other third-parties without consent.

మహిళల అత్యంత గోప్యమైన విషయాలు ఫేస్ బుక్ లో రట్టు..

Posted: 09/11/2019 04:32 PM IST
Menstruation apps shared personal data with facebook without consent

తమ ఆరోగ్యంపై శ్రద్ధతో అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లలో లోడ్ చేసుకుంటున్న యాప్స్, ఇప్పుడు వారి పరువు తీసేలా తయారయ్యాయి. కనీసం రెండు నెలసరి ట్రాకింగ్ యాప్స్, అమ్మాయిల వివరాలను, వారు చివరిసారిగా లైంగిక చర్యలో ఎప్పుడు పాల్గొన్నారన్న విషయాలను ఫేస్ బుక్ కు చెప్పేస్తున్నాయి. అమ్మాయిల స్మార్ట్ ఫోన్లలో సాధారణమైనపోయిన 'మాయా', 'మియా ఫెమ్' యాప్స్ ఈ పని చేస్తున్నాయి.

వాస్తవానికి ఇవి మహిళలకు ఎంతో ఉపయుక్తమైనవని పేరు తెచ్చుకున్న యాప్స్, వీటిల్లో ఒకసారి నెలసరి వచ్చిన తేదీని ఎంటర్ చేస్తే, ఆపై తదుపరి నెలసరి ఎప్పుడు వస్తుందన్న అంచనాలను, అప్పుడు ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పేస్తాయి. ఇదే సమయంలో ఎవరితోనైనా కలవాలని భావిస్తే, ఎప్పుడు కలిస్తే సురక్షితమన్న విషయాన్నీ చెబుతాయి. అంతవరకూ బాగానే ఉంది. యూజర్లు ఎంటర్ చేసే వివరాలను ఈ యాప్స్ ఫేస్ బుక్ కు అందిస్తున్నాయని తాజా నివేదిక సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది.

బ్రిటన్ కు చెందిన ప్రైవసీ ఇంటర్నేషనల్ ఓ అధ్యయనం చేయగా, ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. యువతులు తమకు చెందిన వివరాలను ఈ యాప్లో స్వయంగా పొందుపర్చుకుంటున్నారని, ఎప్పుడు లైంగిక చర్యలో పాల్గొన్నాం... ఎటువంటి గర్భ నిరోధక సాధనాలను వాడాము... ఆ సమయంలో మానసిక స్థితి ఎలా వుంది? తదితర వివరాలను అమ్మాయిలు ఫీడ్ చేసుకుంటుండగా, అవన్నీ సురక్షితంగా లేవని తెలిపింది. ఈ సమాచారం బీమా కంపెనీలకు, వ్యాపార సంస్థలకు సులువుగా చేరిపోతోందని పేర్కొంది.

వీరంతా ఫేస్ బుక్ అడ్వర్టయిజింగ్ నెట్ వర్క్ ను వాడుకుని అమ్మాయిల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారని ఆరోపించింది. ఈ యాప్స్ ఇన్ స్టాల్ చేయగానే ఫేస్ బుక్ కు సమాచార బట్వాడా ప్రారంభం అవుతోందని తెలిపింది. ఇక ఈ రిపోర్టుపై స్పందించిన ఫేస్ బుక్ ప్రతినిధి జోయ్ ఓస్ బోర్న్, వ్యాపార ప్రకటనకర్తలకు ఈ సున్నిత సమాచారం ఏదీ వెళ్లబోదని అన్నారు. యాప్స్ ద్వారా షేర్ చేసుకునే సమాచారం సురక్షితమని అన్నారు. అడ్వర్టయిజర్స్ కేవలం యూజర్ల ఆసక్తిని గమనించి, వారిని లక్ష్యంగా చేసుకుని తమ ఉత్పత్తులకు ప్రచారం చేసుకుంటారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : facebook  data sharing  Maya  Plackal Tech  MIA Fem  Mobapp Development Limited  

Other Articles