congress slams Budget as KCR Failures ‘‘తెలంగాణ బడ్జెట్ కాదిది కేసీఆర్ వైఫల్యాల ప్రతి’’

Jeevan reddy slams telangana budget as kcrs failures book

Jeeven Reddy, Failure, Telangana budget, cm kcr targets bjp in budget, kcr targets pm modi, harish rao, recession effect on telangana budget, trs, congress, bjp, Cabinet meet, Pragati Bhavan, CM KCR Telangana Assembly, Harish Rao, Legislative council, Telangana, Politics

Telangana Congress senior leader Jeevan Reddy slammed Budget as KCR failure. He also said that the CM is not capable enough to get special status to Kaleshwaram project.

‘‘తెలంగాణ బడ్జెట్ కాదిది కేసీఆర్ వైఫల్యాల ప్రతి’’

Posted: 09/09/2019 02:56 PM IST
Jeevan reddy slams telangana budget as kcrs failures book

దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడి గత ఏడాదిన్నర కాలం ఆర్థిక వ్యవస్థను అల్లాడిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు కేంద్రంలో అధికార బీజేపి పార్టీని టార్గెట్ చేయగా, మిగులు బడ్జెట్ తో వున్న రాష్ట్రాన్ని అప్పుల ఊభిలోకి నెట్టిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీన్ని బడ్జెట్ అనడం కంటే... కేసీఆర్ వైఫల్యాల పుస్తకం అంటే బాగుంటుందని ఆయన విమర్శించారు.

ఆర్థిక మాంద్యం పేరు చెప్పి... తన వైఫల్యాలను సీఎం కేసీఆర్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. బడ్జెట్’లో సగానికి పైగా కేంద్రం ఆర్థిక విధానాలపైనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వృద్ధి పడిపోకుండా ఉండేందుకు తానేమీ చేస్తున్నాననే విషయాన్ని కేసీఆర్ చెప్పలేదని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా తెచ్చుకునే అవకాశం ఉన్నా... కేసీఆర్ ఆ పని చేయలేదని జీవన్ రెడ్డి ఆరోపించారు.

కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే తన కమీషన్ల లెక్కలు బయటకు వస్తాయని కేసీఆర్ భయపడుతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. బడ్జెట్ అంచనాలను భారీగా తగ్గించడం సీఎం కేసీఆర్ వైఫల్యానికి నిదర్శనమని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్థికంగా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 24 వేల లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా కేసీఆర్ తయారు చేశారని దుయ్యబట్టారు. ఆయుష్మాన్ భారత్ పథకం నిధులను తెచ్చుకుని ఆరోగ్యశ్రీ అమలుకు వినియోగించుకునే అవకాశం ఉన్నా... సీఎం కేసీఆర్ ఆ పని చేయడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jeevan Reddy  Telangana budget  TRS  Congress  BJP  CM KCR  Telangana  Politics  

Other Articles