74 years old woman creates world record 74 ఏళ్ల వయస్సులో ప్రపంచ రికార్డు సాధించిన బామ్మ

74 years old woman creates world record by giving birth to twins

Umashankar Ahalya Hospital, IVF, mangayamma becomes mother at 74 years, mangayamma gives bith to twins, 74 yrs old gives birth to twins, Guntur, nelaparthipadu, East Godavari, Andhra Pradesh

Mamgayamma, a 74 year old woman creates world record by becoming mother of girl twins through IVF method, This mother hails from nelaparthypadu of East Godavari district in Andhra pradesh.

74 ఏళ్ల వయస్సులో ప్రపంచ రికార్డు సాధించిన బామ్మ

Posted: 09/05/2019 12:57 PM IST
74 years old woman creates world record by giving birth to twins

మాతృత్వం.. మహిళలకు అదో వరం. కమ్మనైన అమ్మతనం కోసం పాకులాడని ఆడవాళ్లు వుండరు. దానిన అనుభవించడం కూడా అదృష్టంగానే భావిస్తారు. అయితే మహిళలకు 50 ఏళ్లు దాటితే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకు కారణం వృద్ధాప్యంలో వారికి రుతుస్రవం స్థంభించిపోవడమే. ఈ రోజుల్లో మహిళలకు 30, 40 ఏళ్లకే ఆ పరిస్థితి వచ్చేస్తోంది. తినే ఆహారం, బిజీ లైఫ్ స్టైల్, ఒత్తిళ్లు, మానసిక అందోళన, స్మోకింగ్, మద్యం సేవించడం వంటివి కూడా నటి మహిళలకు మాతృత్వాన్ని దూరం చేస్తున్నాయి.

అయితే ఈ వృద్దురాలు మాత్రం వీరందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. బామ్మ వయస్సులో కూడా అమె కవల పిల్లల్ని కని ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. అదెలా అంటే.. ఈ 74 ఏళ్ళ వృద్దురాలికి లేటు వయస్సులో మళ్లీ తల్లి కావాలనే కోరిక కలిగింది. దీంతో ప్రస్తుత అందుబాటులో వున్న కొత్త పద్ధతుల ద్వారా (కృతిమ గర్భదారాణ పద్దతి IVF) ద్వారా అమె తల్లి అయ్యింది. గురువారం డాక్టర్లు సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించారు. ఐవీఎఫ్ స్పెషాలిటీ నిపుణులు, గుంటూరు అహల్యా హాస్పిటల్ అధినేత డాక్టర్ ఉమాశంకర్ టీమ్... ఈ ఆపరేషన్ నిర్వహించింది. పండంటి కవల పిల్లలకు మంగాయమ్మ జన్మనిచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో పెళ్లైంది. అప్పటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. కానీ వాళ్ల కోరిక తీరలేదు. 73 ఏళ్లొచ్చినా... మంగాయమ్మకు పిల్లలపై కోరిక తగ్గలేదు. వైద్యరంగంలో అందుబాటులోకి వచ్చిన కొత్త పద్దతుల ద్వారా అమె తల్లి కావాలనుకుంది. ఈ క్రమంలో 2018లో చెన్నై వెళ్లిన మంగాయమ్మ దంపతులు... ఐవీఎఫ్ విధానం ద్వారా సంతానం పొందాలని ప్రయత్నించినా అదీ విఫలమైంది.

అయినప్పటికీ అమెలో తల్లి కావాలన్న కొరిక మరింత బలంగా నాటుకుందే తప్ప వదులుకోలేదు. దీంతో 2018 నవంబర్‌లో గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించారు. అక్కడ మంగాయమ్మ మరోసారి ఐవీఎఫ్ పద్ధతిలో ప్రెగ్నెంట్ అయ్యింది. మంగాయమ్మకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు. ఆమెకు బీపీ, షుగర్ లేకపోవడంతో ప్రెగ్నెన్సీ సాఫీగాసాగింది. హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ పీవీ మనోహర్, జనరల్ మెడిసిన్ డాక్టర్ ఉదయ్ శంకర్ ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు నిర్వహించారు.

కడుపులో బిడ్డలు చక్కగా పెరిగేలా అన్ని చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 10.30కు మంగాయమ్మకు సిజేరియన్ జరిగింది. ఇద్దరు కవలలైన ఆడ పిల్లలకు ఆమె జన్మనిచ్చింది. ఆ వయసులో గర్భం దాల్చడం ఓ ప్రపంచ రికార్డ్ అయితే... కవలలకు జన్మనివ్వడం మరో రికార్డ్ అని డాక్టర్లు తెలిపారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం... ఇదివరకు భారతదేశంలో 70 ఏళ్ల మహిళ తల్లైందని డాక్టర్‌ ఉమాశంకర్‌ తెలిపారు. ఆమె పేరు దల్జీందర్‌ కౌర్‌.

రాజస్థాన్‌కు చెందిన దల్జీందర్‌, మొహిందర్‌ సింగ్‌ గిల్‌ దంపతులకు కూడా మంగాయమ్మ దంపతుల్లాగానే పెళ్లయి 50 ఏళ్లయినా పిల్లలు పుట్టలేదు. ఆమె కూడా ఐవీఎఫ్‌ విధానాన్ని ఆశ్రయించారు. 2016 ఏప్రిల్‌ 19న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రి రికార్డుల ప్రకారం ఆమె వయసు 72 సంవత్సరాలు. అప్పట్లో అది ప్రపంచ రికార్డు. ఈ లెక్కన 74 ఏళ్ల వయసులో తల్లి అయిన మంగాయమ్మ పేరున ప్రపంచ రికార్డు నమోదు అవుతుందని డాక్టర్‌ ఉమాశంకర్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ahalya Hospital  mangayamma  74 yrs old women  twins  Guntur  nelaparthipadu  East Godavari  Andhra Pradesh  

Other Articles