Man held for commiting foster daughter into prostitution కాసుల కోసం 13 ఏళ్లుగా కూతురితో వ్యభిచారం..

Man held for commiting foster daughter into prostitution

father forced daughter into prostitution, guntur prostitution, chilakaluripeta prostitution, woman forced into prostitution, prostitution, prabhudas, veera rao, chilakaluripet, Guntur, Andhra Pradesh, Crime

A man from chilalaluripeta of guntur district held for forcing his foster daughter into prostitution, even after she got married and having two children.

13 ఏళ్లుగా కూతురితో వ్యభిచారం.. పెళ్లైనా వదలని జల్సారాయుడు..

Posted: 08/27/2019 01:43 PM IST
Man held for commiting foster daughter into prostitution

కూతురిలా సాకాడు.. పెరిగి పెద్ద కాగానే అమెను తన జల్సాలకు డబ్బులిచ్చే ఏటీయంలా వాడుకున్నాడు. అంటే అభంశుభం తెలియని బాలికతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఏళ్లుగా గుట్టుగా వ్యభిచారం చేయించాడు. చివరకు అమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు వున్నా.. అతని మనసు మారలేదు. పెంపుడు కూతురు భర్తకు విషయం తెలిసి విడాకులివ్వగా తనకు కాలం కలసివచ్చిందనే భావించాడు తప్ప.. అమె భర్తతో కలిపేందుకు ప్రయత్నించలేదు. ఈ మానవమృగం వేధింపులకు తట్టుకోలేక భాదితురాలు గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. రంగంలోకి దిగిన పోలీసులు పైశాచిక మృగాన్ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ప్రభుదాస్ అలియాస్ వీరారావు అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం ఎక్కడి నుంచో బాలికను తీసుకొచ్చి పెంచుకుంటున్నాడు. ఆమెకు యుక్త వయస్సు రాగానే బెదిరించి వ్యభిచార కూపంలోకి దించాడు. రోజూ ఇంటికే విటులను తీసుకొచ్చి పెంపుడు కూతురితో వ్యభిచారం చేయించేవాడు. ఈ క్రమంలో ఆమెకు పెళ్లయి ఇద్దరు బిడ్డలు పుట్టారు. అయితే వీరారావు తరుచూ కూతురిని పుట్టింటికి తీసుకెళ్లి నెలలకు నెలలు అక్కడే ఉంచుకుంటుండటంతో ఆమె భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఆయన ఆరా తీయగా తన భార్యతో వీరారావు వ్యభిచారం చేయిస్తున్నట్లు తెలిసింది.

దీంతో అతడు భార్య, పిల్లలను వదిలేశాడు. దీంతో ఆమె దిక్కలేని స్థితిలో వీరారావు వద్దే ఉండి వ్యభిచారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే వచ్చిన ఆదాయాన్ని కుటుంబ పోషణకు ఇవ్వకుండా వీరారావే జల్సాలకు ఖర్చు చేసుకుంటుండంతో బాధితురాలు ఎదురుతిరిగింది. తానింక వ్యభిచారం చేయమని, ఏదైనా కూలిపని చేసుకుని జీవిస్తానని చెప్పి పిల్లలను తీసుకుని బయటకు వెళ్లిపోయింది. గత మంగళవారం పెంపుడు కూతురి ఇంటికి వెళ్లిన వీరారావు తనతో రావాలని ఆమెను బెదిరించాడు. కాదనడంతో గొడవకు దిగి సుత్తితో తలపై కొట్టాడు. దీంతో బాధితురాలు 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదుచేసింది. పెంపుడు తండ్రి 13ఏళ్లుగా తనను బెదిరించి వ్యభిచారం చేయిస్తున్నాడని, అతడి బారి నుంచి కాపాడాలని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న చిలకలూరిపేట పోలీసులు సోమవారం వీరారావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles