CWC meeting says Rahul must continue రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా కొనసాగాలి: సీడబ్యూసీ

Congress workers say rahul gandhi must continue as party president

Abhishek Manu Singhvi,Congress,Congress chief,Congress party,Congress President,Gandhi,Ghulam Nabi Azad,INC,Indian National Congress,Lok Sabha polls,Mallikarjun Kharge,Manmohan Singh,Mukul Wasnik,new president of congress,new president of congress 2019,new president of congress after rahul gandhi,new president of congress party,NewsTracker,president of congress party,president of congress party 2019,President of INC,president of inc 2019,president of indian national congress 2019,Priyanka Gandhi,Rahul Gandhi

Congress workers across the board are of the opinion that Rahul Gandhi should continue to remain the party's president, sources said. The support comes from the belief that if anyone outside the Gandhi family becomes president, either interim or permanent, there may be differences and dissension.

రాహుల్ గాంధీయే అధ్యక్షుడిగా కొనసాగాలి: సీడబ్యూసీ

Posted: 08/10/2019 03:26 PM IST
Congress workers say rahul gandhi must continue as party president

కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు సమావేశమైన వర్కింగ్ కమిటీ గాంధీ కుటుంబ వారసులతోనే కాంగ్రెస్ మనుగడ సాధిస్తుందని, వారితోనే మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటుందని తేల్చింది. ముకుల్ వాస్నిక్, మల్లికార్జున ఖర్గే వంటి నేతల పేర్లు కొత్త అధ్యక్షుడి రేసులో బలంగా వినిపించినా, వర్కింగ్ కమిటీ సభ్యులందరూ రాహుల్ గాంధీ వైపే మొగ్గుచూపారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీని మించిన సమర్థుడు మరొకరు లేరని చెప్పుకోచ్చారు.

మతతత్వ పార్టీలు దేశాన్ని ముక్కలు చెక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీని నడిపించడంతో పాటు దేశాన్ని రక్షించగల సత్తా ఒక్క రాహుల్ గాంధీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. అందుకే, రాహులే మళ్లీ రావాలంటూ సీడబ్ల్యూసీ ఏకవాక్య తీర్మానం చేసింది. అయితే, తమ నిర్ణయంపై రాహుల్ ఏమంటాడోనన్న అంతర్మధనంలో ఉన్న కాంగ్రెస్ నేతలు రాత్రి 8 గంటలకు మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దారుణ ఫలితాలు చవిచూసిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆయన మనసు మార్చడానికి కాంగ్రెస్ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడంలేదు. కాగా, కొత్త చీఫ్ ను ఎన్నుకునే క్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 5 ఉప కమిటీలుగా విడిపోయింది. ఈ కమిటీల్లో తమ పేర్లను చేర్చడం పట్ల సోనియా, రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేసి ఎంపికలో తమ ప్రభావం పడే కూడదని వారు సమావేశం మధ్య నుంచే వెళ్లిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Sonia Gandhi  CWC meeting  Priyanka Gandhi  Congress  President  Politics  

Other Articles