PDP MPs attempt to tear of the constitution in the parliament ఎంపీని బలవంతంగా బయటకు పంపిన మార్షల్స్.. కాంగ్రెస్ వాకౌట్..

Pdp mps attempt to tear of the constitution in the parliament

article 35A, Article 370, Nazir Ahmad Laway, MM Fayaz, PDP, Congress, JK, Ladakh, indian armed forces, Jammu and Kashmir, Kashmiri terrorists, mehbooba mufti, Modi Government 2.0, omar abdullah, Operation Kashmir, Pak sponsored terrorism, PM Narendra Modi

PDP's RS MPs Nazir Ahmad Laway&MM Fayaz protest in Parliament premises after resolution revoking Article 370 from J&K moved by HM in Rajya Sabha; They were forciblily sent out of upper house by marshals after they attempted to tear the constitution.

ఎంపీని బలవంతంగా బయటకు పంపిన మార్షల్స్.. కాంగ్రెస్ వాకౌట్..

Posted: 08/05/2019 01:23 PM IST
Pdp mps attempt to tear of the constitution in the parliament

రాజ్యసభలో ఆర్టికల్ 370పై నిరసనల హోరు మధ్య చర్చ జరుగుతున్న వేళ, పీడీపీ సభ్యులు ఇద్దరు రాజ్యాంగాన్ని చింపి వేయడానికి ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పీఫుల్స్ డెమెక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మీర్ ఫయాజ్, నాజిర్ అహ్మద్ లు రాజ్యాంగ ప్రతులను నాశనం చేసేందుకు యత్నించారు. దీన్ని గమనించిన చైర్మన్ వెంకయ్యనాయుడు, వారిని మర్యాదగా బయటకు వెళ్లాలని తొలుత ఆదేశించారు.

అయినా వారు తన ఆందోళనను వ్యక్తం చేస్తూ వారు ధరిచిన చొక్కాలను చించుకుని నిరసన తెలపడంతో, వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లాలని ఆదేశించారు. దీంతో వెంకయ్యనాయుడు అదేశంలో మార్షల్స్ రంగంలోకి దిగి.. నిరసన వ్యక్తం చేస్తున్న పీడీపి పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మీర్ ఫయాజ్, నాజిర్ అహ్మద్ లను బలవంతంగా బయటకు పంపారు. చారిత్రాత్మక నిర్ణయాన్ని యావత్ భారతం స్వాగతిస్తుందని బీజేపి, మిత్రపక్షాలు స్వాగతించాయి.

ఇక మరోవైపు పార్లమెంట్ సాక్షిగా, నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఖూనీ చేసిందని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాంనబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పి, సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్ లోని పీడీపీ సహా కాంగ్రెస్ తో పాటు ఎన్నో పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.

కేంద్రం నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని అన్నారు. అప్రజాస్వామిక పద్దతిలో అత్యంత హడావిడి మధ్య రాష్ట్రాన్ని విభజించి కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఇదే సమయంలో సభలో రాజ్యాంగాన్ని చింపాలని పీడీపీ సభ్యులు ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చొక్కాలు చించుకోవడాన్ని తప్పుబట్టారు. ఆపై కాంగ్రెస్ సభ్యులు   వాకౌట్ చేయగా, రాజ్యసభలో ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర విభజనపై చర్చ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : article 35A  Article 370  Nazir Ahmad Laway  MM Fayaz  PDP  Congress  JK  Ladakh  politics  

Other Articles