Rangam Bhavishyavani 2019 @ Ujjaini Mahankali Temple కోర్కెలన్నీ తీర్చుతా: రాష్ట్ర ప్రజలకు ‘అమ్మ’ అభయం

Rangam bhavishyavani 2019 ujjaini mahankali temple

Rangam at Ujjaini Mahankali temple, Bhavishyavani at Ujjaini Mahankali temple, Secunderabad Ujjaini Mahankali temple, matangi swarnalatha, mahankali Bonalu 2019, Bhavishyavani by matangi Swarnalatha, Secunderabad, Telangana

Rangam Bhavishyavani at Secunderabad Ujjaini Mahankali Bonalu 2019 by matangi Swarnalatha,

కోర్కెలన్నీ తీర్చుతా: రాష్ట్ర ప్రజలకు ‘అమ్మ’ అభయం

Posted: 07/22/2019 03:27 PM IST
Rangam bhavishyavani 2019 ujjaini mahankali temple

గత ఏడాది కన్నెర్ర చేసిన అమ్మవారు ఈ సారి మాత్రం ప్రశాంతంగా, శాంతియుతంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రజలు కోరుకున్న కోర్కెలన్నీ తప్పక తీర్చుతానంటూ అమ్మవారు భక్తులకు భరోసా కల్పించారు. అత్యంత కన్నులపండుగగా జరిగిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర మురసటి రోజైన ఇవాళ ఆనవాయితీ ప్రకారం ఆచరిస్తున్న రంగం కార్యక్రమంలో అమ్మవారు వెల్లడించిన భవిష్యవాణి ఇది.

మాతంగి స్వర్ణలత పచ్చికుండపై నిలబడి, అమ్మవారిని తనలోకి ఆహ్వానించుకుని రంగం కార్యక్రమం నిర్వహించగా, దీన్ని చూసేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సంవత్సరం పూజలు ఎంతో సంతృప్తికరంగా జరిగాయని, గత సంవత్సరం తాను కొంత బాధపడ్డానని, ఈ ఏడాది సిబ్బంది మంచిగా పనిచేశారని పేర్కొంది. ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని, ఐదు వారాలు సాకలతో, పప్పు బెల్లాలతో తనకు పూజలు జరిపించాలని కోరింది.

తన అక్కచెల్లెళ్లు దూరంగా వెళ్లకుండా, తనకు దగ్గరగానే ఉండి పూజలు జరిపించాలని సూచించింది. భవిష్యత్తులో ప్రజలకు ఎటువంటి ఆపదలూ రాకుండా చూసుకుంటానని, తనకు మారు బోనాన్ని తప్పకుండా ఇవ్వాలని అమ్మ సూచించింది. ఈ సంవత్సరం వర్షాలు బాగుంటాయని, రైతులకు మంచి పంటలు పండుతాయని, ప్రజల సంతోషమే తన సంతోషమని వెల్లడించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి అడిగిన పలు ప్రశ్నలకు అమ్మ తరఫున స్వర్ణలత సమాధానాలిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangam  Bhavishyavani  Ujjaini Mahankali Bonalu  matangi Swarnalatha  Secunderabad  Telangana  

Other Articles