Arun Jaitley opts out of new Modi government నాకొద్దు మంత్రిపదవి.. ఆరోగ్యమే ప్రధానం: అరుణ్ జైట్లీ

Arun jaitley opts out of modi cabinet cites health reasons

arun jaitley, arun jaitley health, arun jaitley modi cabinet, arun jaitley new portfolio, arun jaitley health conditions, narendra modi, modi cabinet, modi new cabinet, PM Modi, Narendra Modi, Cabinet berth, Health issues, New Delhi, National Politics

In a letter addressed to Prime Minister Narendra Modi, Jaitley made a "formal" request to not be given any responsibility in the new government so that he can concentrate on his "treatment" and "health."

నాకొద్దు మంత్రి పదవి.. ఆరోగ్యమే ప్రధానం: మోడీకి అరుణ్ జైట్లీ లేఖ..

Posted: 05/29/2019 04:39 PM IST
Arun jaitley opts out of modi cabinet cites health reasons

ప్రధాన మంత్రిగా మరో పర్యాయం గురువారం రాత్రి ఏడున్నర గంటలకు రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేయనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. తన క్యాబినెట్ కూర్పుపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటుగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో కూడా చర్చించి.. తుది జాబితాను సిద్దం చేస్తున్నారని సమాచారం. ఈ సమయంలో కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం తీసుకుని ప్రధాని నరేంద్రమోడీని ఇరుకున పెట్టారు.

ఇప్పటికే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ అనారోగ్యం కారణంగా అమెను కేంద్రమంత్రి పదవికి దూరంగా ఉంచాలని బీజేపి అధిష్టానం భావిస్తొంది. ఈ నేపథ్యంలో సీనియర్ నేతగా,అనుభవ ప్రజ్ఞశాలిగా నెంబర్ టు స్థానంలో కొనసాగుతున్న కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ.. తాను ఇంకోసారి మంత్రి పదవిని చేపట్టలేనని అరుణ్ జైట్లీ నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఎన్నికలు ప్రచారం పూర్తైన తరువాత కేదార్ నాథ్ పర్యటనలకు వెళ్తున్న క్రమంలో ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి మౌఖికంగా తీసుకువచ్చినట్టు కూడా ఆయన లేఖలో పేర్కోన్నారు.

arun jaitley modi letter

(Image Source: Twitter.com/arunjaitley)

అనారోగ్య కారణాల దృష్ట్యా తాను బాధ్యతలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు జైట్లీ లేఖలో పేర్కోన్నారు. పార్టీకి తన అవసరం ఎప్పుడొచ్చినా తాను మద్దతుగా ఉంటానని జైట్లీ అన్నారు. అవసరమైతే పార్టీకి  సలహాలు ఇస్తానని చెప్పారు. గత 18 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, నా శరీరానికి విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారని, నా ఆరోగ్యానికి, చికిత్సకు తగినంత టైమ్ కావాలి కాబట్టి నేను ఏ భాధ్యతలు తీసుకోలేనని జైట్లీ వివరించారు. గత ఎన్డీయే ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ  ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arun Jaitley  PM Modi  Narendra Modi  Cabinet berth  Health issues  New Delhi  National Politics  

Other Articles