intermiediate board new decision left students in shock విమర్శలు పెల్లుబిక్కినా.. ఆదాయాన్ని వదులుకోని ఇంటర్ బోర్డు

Intermiediate board new decision left students in shock

Intermiediate students suicide, intermiediate board officials RTI ACT, Ashok on Inter marks goof -up, ashok on Intermiediate answer sheets, Globarina, interboard failure, Intermiediate students, students suicides, CM KCR, Inter marks goof -up, Intermiediate results, ashok kumar, inter board secretary, RTI Act, social media, answer sheets, Telangana Inter Board, Telangana, politics

Telangana Intermiediate Board officials new decision has left students and parents in shock as it says they will return amount only if marks increased in revaluation

విమర్శలు పెల్లుబిక్కినా.. ఆదాయాన్ని వదులుకోని ఇంటర్ బోర్డు

Posted: 04/26/2019 03:59 PM IST
Intermiediate board new decision left students in shock

ఇంటర్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా ఈ పర్యాయం ఫలితాల వెల్లడిలో విమర్శలను ఎదుర్కోన్న తెలంగాణ ఇంటర్ బోర్డు.. తన తీరును మాత్రం మార్చుకోవడం లేదన్న విమర్శలు పెల్లుబిక్కుతున్నాయి. రోజుకో ప్రకటన చేస్తూ.. విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోందని పలువురు తల్లిదండ్రులు తమ అక్రోశం వెల్లగక్కుతున్నారు. ఇందుకు కారణం ఇంటర్ బోర్డు తాజాగా చేసిన ప్రకటన. ఎవరెలా పోతే మాకేంటి.. మాకు కావాల్సిన అదాయం మాకు వస్తుందా.? లేదా.? అన్న ధోరణిలో బోర్డు వ్యవహరిస్తోందని ఈ ప్రకటన స్పష్టం చేస్తోందన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి.

ఇప్పటికే ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను మరోసారి మూల్యాంకనం చేయనున్నట్టు ప్రకటించిన తెలంగాణ ఇంటర్ బోర్డు, రీ వాల్యుయేషన్ కు దరఖాస్తు చేసుకున్న వారికి మార్కులు పెరిగితే, రుసుమును వెనక్కు ఇచ్చేయాలని మరో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ఒక్కో జవాబు పత్రానికి రీ వాల్యుయేషన్, వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థుల మార్కులు పెరిగితే, ఫీజుగా తీసుకునే రూ. 600 వెనక్కు ఇచ్చేస్తామని విద్యా శాఖ కార్యదర్శి బీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం తాము రాసిన ఆరు పేపర్ల పునఃపరిశీలనకు విద్యార్థులు రూ. 3 వేలు చెల్లిస్తున్నారు. ఒకవేళ మార్కులు పెరిగినా, ఇప్పటివరకూ చెల్లించిన డబ్బును వెనక్కు ఇచ్చే పరిస్థితి లేదు. మార్కులు పెరిగితే, తొలిసారిగా దాన్ని దిద్దిన అధ్యాపకుడు చేసిన తప్పు తీవ్రతను బట్టి రూ. 2 వేల నుంచి రూ. 20 వేల వరకూ జరిమానా విధిస్తున్నారు. కాగా, ప్రతి సంవత్సరమూ రీ వాల్యుయేషన్ కు 18 నుంచి 20 వేల వరకూ దరఖాస్తులు వస్తుండగా, ఈ సంవత్సరం ఇప్పటికే 75 వేలకు పైగా దరఖాస్తులు రావడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ashok kumar  inter board secretary  RTI Act  social media  answer sheets  Telangana Inter Board  

Other Articles