Rs 8 Cr Cash Seized in Narayanaguda పట్టుబడిని రూ.8 కోట్ల నగదు.. బీజేపికి చెందినదా.?

Does rs 8 cr cash seized in narayanaguda belong to bjp

Elections, Telangana elections, Telangana polls, cash seized, cash seized updates, cash seized latest, Rs 8 Cr Cash Seized in Narayanaguda, Telangana, politics

Hyderabad Taskforce cops seized cash worth Rs 8 crores in Narayanaguda. The initial investigation revealed that the cash was brought for a leader from BJP. They seized Rs 2 crores initially and they got to trace Rs 6 crores near a bank in Narayanaguda and seized the cash.

ITEMVIDEOS: పట్టుబడిని రూ.8 కోట్ల నగదు.. బీజేపికి చెందినదా.?

Posted: 04/08/2019 09:09 PM IST
Does rs 8 cr cash seized in narayanaguda belong to bjp

పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ సమాయత్తం అవుతుండటం.. ఇక మరికొన్ని గంటల్లో ప్రచారపర్వానికి కూడా తెరపడుతుండటం.. ఆ తరువాత మనీ, మద్యం ఏరులై పారడం సాధారణ విషయమే అయినా.. గతంలో ఎన్నడూ లేనట్టుగా తెలంగాణ పోలీసులు ఈ సారి ఎక్కడికక్కడ అక్రమంగా తరలివెళ్తున్న నోట్ల కట్టలపై భారీ దృష్టి సారించారు. తొలి విడత పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్లో పోలీసులు భారీగా నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.

తాజాగా హైదరాబాద్ మహానగరం నట్టనడిబోడ్డున పెద్దమొత్తంలో నగదు పట్టుబడటం సంచలనంగా మారింది. నారాయణగూడ ఫ్లై ఓవర్ దగ్గర కారులో తరలిస్తున్న 8 కోట్ల రూపాయలను నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు ఈ డబ్బు ఒక జాతీయ పార్టీ కి చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ఆ పార్టీకి చెందిన కార్యాలయ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

కాగా నారాయణగూడ ఫ్లైఓవర్ పైనుంచి వెళ్తున్న ఓ కారును ఆపిన టాస్క్ ఫోర్స్ పోలీసులు కారును తనిఖీ చేయగా అందులో రూ. 2 కోట్లు లభ్యమయ్యాయి. దీంతో కారులోని వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా, ఇంకా తమ పార్టీకి చెందిన వ్యక్తులు బ్యాంకు వద్దే వున్నారని.. వారి వద్ద రూ.6 కోట్ల నగదు కూడా వుందని, ఇది పార్టీ ఫండ్ కోసమని తాము బ్యాంకు నుంచి విత్ డ్రా చేసి అధికారికంగా తీసుకెళ్తున్నామని తెలిపారు. వారిచ్చిన సమాచారంతో పోలీసులు మిగిలిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని రూ.6 కోట్లను స్వాధీనం చేసుకున్నారు.

జాతీయ పార్టీకి చెందిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఆదేశాల మేరకు బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసినట్లు అతను వెల్లడించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. బ్యాంక్ నుంచి తీసుకువస్తున్న ఈ 8 కోట్ల రూపాయలకు ఆధారాలు ఉన్నాయా.. ఎందుకు డ్రా చేశారు.. ఆ డబ్బు ఆ పార్టీ ఖాతా నుంచే డ్రా చేశారా లేక.. ఇతర ఖాతాల నుంచి డ్రా చేశారా అనే విషయాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఒకరి నుంచే 8 కోట్ల రూపాయలు పట్టుబడటం హైదరాబాద్ సిటీలో ఇదే కావటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 8 crore cash  election officials  hyderabad police  BJP Leader  Telangana  politics  

Other Articles