Election commission extends polling time by an hour దేశవ్యాప్తంగా గంట పాటు పోలింగ్ సమయం పెంపు..

Polling time in india for general elections extended by an hour due to summer

Election commission, voting percentage, right to vote, hot summer, EC extending polling time by an hour, general elections, Assembly Elections, Andhra pradesh, National Politics

Central Election commission has kept hot summer in view and gave a chance to voters of india by extending polling time by an hour, Its has taken these steps to increase voting percentage in general elections.

ఇప్పుడైనా ఓటు వేస్తారా.. దేశవ్యాప్తంగా గంట పాటు పోలింగ్ సమయం పెంపు..

Posted: 04/04/2019 02:46 PM IST
Polling time in india for general elections extended by an hour due to summer

పోలింగ్ సమాయాన్ని గంట పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికలల్లో పోలింగ్ సమయాన్ని గంట పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ఎన్నికలు రావడంతో ఓటింగ్ శాతంపై దాని ప్రభావం పడుతుందని భావించిన ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. 2019 ఎన్నికల్లో మాత్రం గంట సమయం పెంచారు. సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశం ఉంది.

ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకునేందుకు వీలు కల్పించేందుకే ఎన్నికల సంఘం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌ సమయాన్ని గంట పొడిగించింది. ఓటర్ల సంఖ్య పెరగడం ఓ కారణం. మరో కారణం వీవీ ప్యాట్‌. మనం ఎవరికి ఓటు వేశాం అని తెలుసుకోవటానికి 7 సెకన్ల సమయం పడుతుంది. ఈ కారణంతోనూ పోలింగ్ సమయాన్ని గంట పెంచింది ఈసీ. అదే విధంగా సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ బూత్‌ దగ్గర ఉండే  ప్రతి ఒక్క ఓటరుకు అవకాశం కల్పిస్తారు అధికారులు.

ఎండలు మండిపోతుండడంతో సాయంత్రం వేళ వెళ్లి ఓటు వేద్దాంలే అనుకునే ఓటర్లను కూడా ఈసీ దృష్టిలో పెట్టుకుంది. అలాంటి వారికి ఈ గంట సమయం పెంపు ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఎన్నికల సంఘం ఈసారి ఓ గంట అదనపు సమయాన్ని కేటాయించింది, ఓటింగ్ శాతం పెంపోందించేందుకు ఎన్నికల కమీషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం పట్ల అన్ని రాజకీయ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. అయితే ఈ వెసలు బాటునైనా దేశంలోని ఓటర్లు వినియోగించుకుంటారా.? లేదా.? అన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles