class X student wants chandrababu to be CM again చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని చిన్నారి ఏం చేసిందంటే..

Class x student donates rs 1 lakh to tirumala asking chandrababu to reinitate power

Ambula vyshnavi, ap chief minister chandrababu, Amaravati, brand ambassador, n. chandrababu naidu, tirumala tirupati Balaji, amaravati, Mudinepalli, krishna district, General Elections 2019, TDP, Assembly Elections, machilipatnam, vijayawada, Politics

A girl studying in Class X, A. Vyshnavi, who is the brand ambassador of Amaravati after she donated Rs 1 lakh for construction of the new capital last year has once again donated Rs ! Lakh to Tirumala Tirupati lord asking to make chandrababu CM again.

చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని చిన్నారి ఏం చేసిందంటే..

Posted: 04/02/2019 02:56 PM IST
Class x student donates rs 1 lakh to tirumala asking chandrababu to reinitate power

ఆంద్ర్రప్రదేశ్ రాష్ట్ర అధికార పగ్గాల కోసం రాష్ట్రంలోని అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలతో పాటు మార్పు కోసం వచ్చిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పార్టీలు పోటీపడుతూ.. తమ ప్రచారాన్ని ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇక వారి అభిమానులు కూడా అంతకురెట్టింపు స్థాయిలో తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమలో కొందరు అభిమానులు నేతల కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్ రహస్యంగా రాజశ్యామాల యాగం చేశారన్న వార్త తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకే ఆయన ఈ యాగాన్ని అత్యంత గోప్యంగా చేశారని బెంగళూర్ మిర్రర్ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ వార్త వెలుగులోకి రాగానే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ తన సోదరి, బావల చేత శ్రీయాగం నిర్వహింపజేశారు. ఈ యాగం ఇవాళ పూర్తికావస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో మరో చిన్నారి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ.. ఏకంగా లక్ష రూపాయలను విరాళంగా ఇచ్చింది.

అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే అధిష్టించాలని ఈ చిన్నారి ఆకాంక్షించింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాలని ఆకాంక్షిస్తూ కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి అనే పదో తరగతికి చెందిన చిన్నారి తిరుమల వెంకటేశ్వరస్వామికి రూ.లక్ష విరాళంగా సమర్పించింది. దీనికి సంబంధించిన డిపాజిట్‌ ప్రతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో బి.లక్ష్మీకాంతంకు పంపించింది. అంతేకాదు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే శ్రీవారిని దర్శించుకుంటాననీ..తిరుమలకు నడిచి వస్తానని మొక్కుకుంది వైష్ణవి.

అయితే ముఖ్యమంత్రి చంద్రాబాబు అంటే ఈ చిన్నారికి ఎంత అభిమానమో చెప్పనక్కల్లేదు. ఎందుకంటే.. చంద్రబాబు చేపట్టిన కీలక ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావాలని, నిరాటంకంగా అభివృద్ది పనులు పూర్తికావాలని అమె ఇప్పటికే అకాంక్షించింది. అంతటితో ఆగకుండా పోలవరం ప్రాజెక్టు కోసం తన తండ్రి డాక్టర్‌ మనోజ్‌ సహకారంతో ఎకరం భూమి రాసిస్తానని కూడ వైష్ణవి చెప్పింది. ఇక ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం అమె తన తల్లిదండ్రులతో కలసి వెళ్లి చంద్రబాబుకు ఏకంగా లక్ష రూపాయాల విరాళాన్ని అందజేసింది. దీంతో వైష్ణవిలా అందరూ ప్రేరణపొందాలని అమెను అమరావతికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు చంద్రబాబు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ambula vyshnavi  ap chief minister  chandrababu  tirumala tirupati Balaji  vijayawada  Politics  

Other Articles