Is Harish Rao planning to join BJP? బీజేపి గూటికి హరీష్ రావు..? కీలక చర్చలు పూర్తి..

Former minister harish rao planning to join bjp

Harish rao to join BJP, Harish Rao all set to join BJP, harish rao amit shah, T Harish rao, chief minister KCR, k. chandrasekhar rao, KTR, BJP, Telangana, Politics

Fed up of being sidelined, top TRS leader T. Harish Rao is said to be seriously considering plans to move to the BJP on an invitation from top leaders of the party. The shock move could seriously affect, and even split, the TRS

బీజేపి గూటికి హరీష్ రావు..? కీలక చర్చలు పూర్తి..

Posted: 04/01/2019 03:32 PM IST
Former minister harish rao planning to join bjp

తెలంగాణ మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీశ్ రావు టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారన్న వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన నాడు.. కేసీఆర్ కుటుంబం నుంచి తొలిసారిగా జెండా పట్టి నడిచిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు. ఆయనలాంటి ముఖ్య నేత ప్రస్తుతం బీజేపిలోకి వెళ్తున్నారని.. ఈ మేరకు ఆయన బీజేపి అధిష్టానంతో కీలక చర్చలు ముగించుకున్నారని సమాచారం. నమస్తే తెలంగాణ మాజీ చైర్మన్ రాజాం తన సోంతంగా పెట్టినప్పుడే హరీష్ రావు, బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల మధ్య ఒప్పందాలు జరిగాయని కూడా టాక్.

అయితే ఈ విషయంలో ఇంకా ఎటు తేల్చుకోలేని హరీష్ రావు.. తరువాత నిర్ణయం చెబుతానని దాటవేత ధోరణిని అవలంభిస్తూ వచ్చారని తెలుస్తోంది. కాగా తాజాగా ఆయనకు మంత్రి పదవిని కూడా కేటాయించకుండా.. కేవలం మెదక్ జిల్లాకు మాత్రమే పరిమితం చేయడంతో హరీష్ రావు తాజాగా బీజేపితో కీలక చర్చలు జరిపారని, లోక్ సభ ఎన్నికల తరువాత ఆయన బీజేపి తీర్థం పుచ్చుకోనున్నారని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు దక్కన్ క్రానికల్ అనే ప్రముఖ అంగ్ల పత్రిక ఓ బాంబులాంటి కథనాన్ని ప్రచురించి తీవ్ర కలకలాన్ని రేపింది.

ఇందుకు కేసీఆర్ అల్లుడు సంతోష్ కూడా కారణమని, అసలు సంతోష్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం నుంచే హరీష్ రావుకు పార్టీలో ఆదరణ తగ్గుతూ వస్తుందని ఆంగ్లపత్రిక తన కథనంలో చెప్పుకోచ్చింది. ఇప్పటికే రాజకీయంగా హరీశ్ రావు ఊగిసలాటలో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఈ వార్తను పత్రిక ఇచ్చింది. ఈ వార్తను నిజమని నమ్మి లక్షలాది మంది పాఠకులు ఆతృతగా చదివారు.

చివరాఖున "ఇది ఏప్రిల్ ఫూల్ డే అని పాఠ‌కులు గుర్తుంచుకోవాలి" అన్న వాక్యాన్ని చూసేంత వరకూ ఈ వార్తను నిజమని నమ్మేలా చేసింది. దీంతోడెక్కన్ క్రానికల్ వేసిన క్రూడ్ జోక్ పై సెటైర్లు వేస్తున్నారు. వాస్తవానికి ఓ పదేళ్ల క్రితం వరకూ ఏప్రిల్ 1న ఈ తరహా వార్తలను అన్ని దినపత్రికలూ ప్రచురించి, చివరిలో ఇది 'ఫూల్స్ డే' అని గుర్తు చేస్తుండేవి. కాలానుగుణంగా ఆ సంప్రదాయం తొలగిపోయింది. అటువంటి సమయంలో హరీశ్ రావుపై బ్యానర్ కథనంగా 'ఫూల్స్ డే స్టోరీ'ని ప్రచురించడం చర్చనీయాంశమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : T Harish rao  chief minister KCR  k. chandrasekhar rao  KTR  BJP  congress  Telangana  Politics  

Other Articles