'Chowkidar' chai on Indian railways చాయ్ కప్పుపై చౌకీదార్.. ఎలా వచ్చింది చెప్మా..

Irctc serves chai in cup with narendra modi s main bhi chowkidar slogan

indian railways, main bhi chowkidar, shatabdi, shatabdi cups, kathgodam shatabdi, chowkidar, PM Modi, IRCTC, paper cups, Chaiwala, rahul gandhi, congress, National politics

The Indian Railways found itself caught on the wrong side of the model code of conduct yet again when passengers reported that tea was being served in paper cups with "main bhi chowkidar" ('I'm also watchman') written on them.

చాయ్ కప్పుపై చౌకీదార్.. ఎలా వచ్చింది చెప్మా..

Posted: 03/29/2019 11:16 PM IST
Irctc serves chai in cup with narendra modi s main bhi chowkidar slogan

ఎన్నికల కోడ్ అమల్లో వుండగా, మీరట్ నుంచి క్రితం రోజున తన ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోడీ.. దేశమంతా చౌకీదార్ అంటూ.. చౌకీదార్ పదానికి వన్నెతెస్తున్న తరుణంలో ఆయన కాపలా వుండగానే పెద్ద తప్పిదం జరిగింది. ఏకంగా రైల్వే శాఖకు చెందిన పర్యాటక విభాగం ఐఆర్సీటీసీ ఇందుకు కారణమైంది. కాపలాదారు ప్రచారం మెదలుపెట్టిన రెండో రోజునే ఇలాంటి తప్పదం ఎలా జరిగిందా.? అంటూ రంగంలోకి దిగారు కేంద్ర ఎన్నికల అధికారులు.

ఎన్నికల సిత్రాలలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఏ పని చేయడానికైనా వెనక్కి తగ్గిన నేతలు.. ఎన్నో ప్రయత్నాలు చేసి నెపాన్ని మాత్రం మరోకరిపై వేసి తప్పించుకోవడం పరిపాటే. అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుతూ దొరికితేనే పక్కనోడిని దొంగను చేసి తప్పించుకునే పాలసీని ఫాలో అవుతుంటారు.
సరిగ్గా ఇక్కడ జరిగింది కూడా అదే. అందివచ్చింది కదా అని చిఖరికి తాగే టీ కప్పులను కూడా వదలడం లేదు. పేపర్ టీ కప్పులపై కూడా మై బీ చౌకీదార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి తెరతీశారు. రైల్వే బోర్డులో జరిగిన తప్పిదంతో ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘనకు గురైంది.

ఈ క్రమంలో చౌకీదార్ పేరుతో రైల్లో పేపర్ టీ కప్పులు దర్శనమిచ్చాయి. ఖోత్ గూదాంకు వెళ్తున్న శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైల్లో సర్వ్ చేసిన చౌకీదార్ టీ కప్పును ఓ ప్రయాణికుడు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. పేపర్ కప్ పై .. నేను కూడా చౌకీదార్ నే అని హిందీలో రాసి ఉంది. ఈ వైరల్ ఫొటోపై స్పందించిన రైల్వేబోర్డు వెంటనే పేపర్ కప్స్ కంట్రాక్ట్ ను రద్దు చేసుకున్నట్టు ప్రకటించింది. సదరు కంట్రాక్టర్ కు భారీ జరిమానా విధించింది.


పేపర్ కప్ పై ప్రకటన ఇచ్చింది సంకల్ప్ ఫౌండేషన్ కు చెందిన ఓ ఎన్జీవో సంస్థగా తెలుస్తోంది. టీ కప్పులపై మెయిన్ భీ చౌకీదార్ అని హిందీ అక్షరాల్లో రాసి ఉన్నట్టు విచారణలో వెల్లడైంది. టీ కప్పులపై చౌకీదార్ పేరుతో సర్వ్ చేయడానికి ఐఆర్సీటీసీ నుంచి ఎలాంటి ఆమోదం లేదని, వెంటనే ఈ తప్పిదానికి రైల్వే సూపర్ వైజర్, అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. పేపర్ టీ కప్పులను అందించే సర్వీసు ప్రొవైడర్ కు రూ.లక్ష వరకు జరిమానా విధించారు. క్రమశిక్షణ చర్యల కింద సదరు సర్వీసు ప్రొవైడర్ కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్టు ఐఆర్సీటీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

రైల్వేలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటన జరగడం ఇది రెండోసారి. ఇటీవల రైల్వే టికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు దర్శనమివ్వడంతో తృణమూల్ నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రైల్వే బోర్డు ప్రయాణికులకు జారీ చేసే టికెట్లను విత్ డ్రా చేసుకుంది. దీనిపై రైల్వే స్పందిస్తూ.. ఉద్దేశపూర్వకంగా చేసిందికాదని, అనుకోకుండా జరిగిన తప్పిదంగా వివరణ ఇచ్చుకుంది. మరోవైపు రైల్వే నిర్వాకంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chowkidar  PM Modi  IRCTC  paper cups  Chaiwala  rahul gandhi  congress  National politics  

Other Articles