actress Namitha car checked thrice a day by EC officails మూడు చోట్ల కారులో తనిఖీలపై నటి అసహనం..

Actress namitha impatient against ec officials checking her car thrice

actress car checked at three junctions, actress namitha car checked by EC officials, Actress Namitha, Husband, Veerendra chowdhary, Yercaud, three junctions, election commission, cops, TV channels, Tamil Nadu, Politics

Namitha was recently in the news when reports of the actress behaving rudely with the cops and election commission officials had surfaced on TV channels. Her husband Veerendra Chowdhary has now given a detailed account of the incident.

ఈసీ అధికారులపై నటి అసహనం.. మూడు చోట్ల తనఖీలపై గరం..

Posted: 03/29/2019 04:21 PM IST
Actress namitha impatient against ec officials checking her car thrice

ఎన్నికల కోడ్ అమల్లో వున్న సమయంలో ఎంతటి పెద్ద సెలబ్రిటీలు, వీవీఐపీలైనా.. ఎన్నికల కమీషన్ అధికారులకు, పోలీసులకు సహకరించాల్సిందే. అయితే ఒకే రోజు మూడు చోట్ల తనిఖీలు పూర్తి చేసుకుని ముందుకుసాగుతున్న వేళ్ల.. మరో ఎన్నికల అధికారుల బృందం తనిఖీల పేరుతో కారును.. ఆ తరువాత చేతిలోని హ్యాండ్ బ్యాగ్ ను తనిఖీలు చేస్తే వెళ్లాల్సిన ప్రయాణానికి అడుగడుగునా అడ్డుపడితే ఎంతటి శాంతమూర్తులైనా అసహనం వ్యక్తం చేస్తారు.

ఇదే పరిస్థితి ఇప్పుడు తమిళనాడు స్టార్ హీరోయిన్ నమితకు ఎదురైంది. ఎన్నికల అధికారుల వరుస తనిఖీలతో అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రముఖ నటి నమిత.. ఈ విషయం ఎన్నికల అధికారులకు తెలియదు. ఎవరు ఏం చేప్పినా.. ఏం కారణాలు చెప్పినా.. వారి తమ విధులను తాము నిర్వహిస్తారు. దీంతో  నడి రోడ్డుపై ఎన్నికల అధికారుల మళ్లీ తనిఖీలు చేయడంతో అమె వారిపై అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌తో నటి నమిత వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ ప్రాంతంలో కలకలం చెలరేగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ నాయకులు ఓట్లకు నోట్లు విరజిమ్మడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ఎన్నికల అధికారులు అలాంటి వాటిని అరికట్టడానికి చర్యలు చేపట్టారు. సేలం, కొండాలాంపట్టి సమీపంలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి ఆనంద్‌ విజయ్‌ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన నటి నమిత కారును నిలిపి తనిఖీ చేయాలని చెప్పగా నమితతో పాటు ఆమె కారులో ఉన్న మరి కొందరు అందుకు అడ్డు చెప్పారు.

దీంతో అక్కడ నమితకు ఫ్లయింగ్ స్క్వాడ్‌ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు తాము తనిఖీలు చేస్తున్నామని, అందుకు సహకరించాలని ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి చెప్పడంతో నటి నమిత వర్గం అంగీకరించారు. అయితే తనిఖీల్లో నమిత కారులో నగదు, ఇతర విలువైనవి లభించలేదు. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్‌ ఆమె కారుని పంపేశారు. దీనిపై అమె భర్త వీరేంద్ర చౌదరి వివరణ ఇస్తూ అప్పటికే మూడు చోట్ల నమిత కారు అధికారులు తనిఖీలు చేశారని, ఇక ఆనంద్ విజయ్ టీమ్ లోని సభ్యుడు అమె బ్యాగును కూడా తనిఖీ చేయాలని చెప్పడంతో అందుకు మహిళా అధికారికి కవాలని అమె చెప్పారని అంతేకానీ ఎన్నికల అధికారుల తనిఖీలకు నమిత అడ్డుచెప్పలేదని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Namitha  Husband  Veerendra chowdhary  election commission  cops  TV channels  Tamil Nadu  Politics  

Other Articles