Pawan kalyan file nomintions from Bhimavaram నామినేషన్ దాఖలు చేసిన జనసేనాని పవన్

Janasena president pawan kalyan file nomintions from bhimavaram

pawan kalyan, janasena, Pawan Kalyan SPY Reddy, Pawan Kalyan VV Laxmi Narayana, VV Laxmi Narayana JanaSena, VV Laxmi Narayana vishakapatnam Lok Sabha, Pawan Kalyan Gajuwaka, andhra pradesh, politics

Janasena President Pawan kalyan filed nomintions from Bhimavaram assembly constituency, between huge crowd of his fans and jansainiks,

భీమవరం నుంచి నామినేషన్ దాఖలు చేసిన జనసేనాని పవన్

Posted: 03/22/2019 05:00 PM IST
Janasena president pawan kalyan file nomintions from bhimavaram

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్ క‌ల్యాణ్ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఆశేష జ‌న‌వాహిని తోడు రాగా భీమ‌వ‌రంలోని త‌హ‌శీల్దార్ కార్యాల‌యానికి చేరుకున్నారు. రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను స‌మ‌ర్పించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెంట త‌మిళ‌నాడు మాజీ సిఎస్ రామ్మోహ‌న్ రావు, మాదాసు గంగాధరం, బొమ్మదేవర శ్రీధర్ (బన్ను), చిదంబరం తదితరులు ఉన్నారు.

భీమవరంతో పవన్ కల్యాణ్ కు మంచి అనుబంధం

భీమ‌వ‌రంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ కి చాలా అనుబంధం ఉంది. స్థానిక డి.ఎన్.ఆర్ కళాశాల‌లో ప‌రీక్ష‌లు రాశారు. స‌మాజాన్ని అర్ధం చేసుకోవ‌డం ఇక్క‌డ నుంచే మొద‌లు పెట్టారు. పోరాట‌యాత్ర‌లో భాగంగా 10 రోజుల పాటు ఇక్క‌డే గ‌డిపిన ప‌వ‌న్ క‌ల్యాణ్.. ఈ ప్రాంతంలో అన్ని వ‌ర్గాల ప్ర‌తినిధుల‌తో స‌మావేశ‌మై వారి క‌ష్టాలు తెలుసుకున్నారు. ఆక్వా కాలుష్యంతో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందులు తెలుసుకుని, బాధ్య‌తా యుత‌మైన ఆక్వా పాల‌సీ తీసుకొస్తామ‌ని ఇక్క‌డ నుంచే హామీ ఇచ్చారు. మురికికూపంలా మారిన య‌న‌మ‌దుర్రు డ్రెయిన్ ను ప‌రిశీలించి రాజ‌కీయ ప్ర‌క్షాళ‌న భీమ‌వ‌రం నుంచే మొద‌లు పెడ‌తామ‌ని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇవాళ భీమ‌వ‌రం శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

భీమ‌వ‌రాన్ని అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దుతా

రాజ‌కీయం భావ‌జాలంతో ముడిప‌డి ఉండాలి కానీ కులంతో కాద‌ని, త‌న‌కు కులం మ‌తం లేదు మాన‌వ‌త్వ‌మే ఉంద‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్ప‌ష్టం చేశారు. ఈ సిద్ధాంతాల‌ను తాను ఎంత భుజాన వేసుకుంటానో చేసి చూపుతాన‌ని తెలిపారు. అభివృద్దిలో అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని చెప్పారు. అనంత‌రం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన వివిధ పార్టీల నేత‌లు జ‌న‌సేన పార్టీలో చేరారు. తాను జేజేలు కొట్టించుకోవ‌డానికి కాదు. డ‌బ్బు సంపాదించ‌డానికి రాలేదని, ప్రజల కోసం ప్రజల కష్టాలను తీర్చడానికి మాత్రమే వచ్చానని అన్నారు.

భీమ‌వ‌రం ఎమ్మెల్యేగా తనకు అవ‌కాశం ఇస్తే భీమ‌వ‌రంని అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దుతానని.. విశ్వ‌న‌గ‌రంగా త‌యారు చేసే బాధ్య‌త తీసుకుంటానని అన్నారు. తన కోసం కాదు మ‌న బిడ్డ‌ల భ‌విష్య‌త్తు కోసం అడుగుతున్నా. నేను మీ సేవ‌కుడిని , మీతో చ‌ప్ప‌ట్లు కొట్టించుకోవ‌డానికో, భుజాల మీద ఎక్కి న‌డిచే నాయ‌కుడ్నో కాదు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఎమ్మెల్యేలు వేల కోట్లు సంపాదించుకుంటున్నారుగానీ, డంపింగ్ యార్డు త‌ర‌లించ‌లేక‌పోయారు. య‌న‌మ‌దుర్రు డ్రెయిన్ స‌మ‌స్య‌ను తీర్చ‌లేక‌పోయారని పవన్ అన్నారు.

గోదావ‌రి ఉన్నా బోర్లు వేస్తే వ‌చ్చేది కాలుష్య జ‌లాలే. భీమ‌వరం న‌గ‌రాన్ని బోలెడంత అభివృద్ది చేయాలి. ఇక్క‌డ పుట్టి ఏజెన్సీలో గిరిజ‌నుల కోసం బ్రిటీష్ కి ఎదురెళ్లిన అల్లూరి సీతా‌రామరాజు స్ఫూర్తితో ప‌నిచేస్తానని చెప్పారు. జ‌న‌సేన పార్టీ స్థాపించిన‌ప్పుడు తన అకౌంట్‌లో కోటీ 60 ల‌క్ష‌ల రూపాయిలు మాత్ర‌మే ఉన్నాయి. పార్టీ పెట్ట‌డానికి భావ‌జాలం కావాలి గాని డ‌బ్బు అవ‌స‌రం లేద‌ని భావించానన్నారు. ధైర్యంగా ముందుకి వ‌చ్చా. ధైర్యం ఉన్న చోట ల‌క్ష్మి ఉంటుంది. భీమ‌వ‌రం ప్ర‌జ‌ల ప్రేమ మ‌ర‌వ‌లేనని అన్నారు పవన్.

జనసేనుడి వెంట కదిలిన భీమవరం

విజయవాడ నుంచి భీమవరానికి హెలికాఫ్టర్ లో వచ్చారు. పవన్ కల్యాణ్ గారికి భీమవరం నాయకులు ఘన స్వాగతం పలికారు. విష్ణు కాలేజీ ప్రాంగణంలోని దేవాలయంలో పవన్ కల్యాణ్ గారికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేయడానికి పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌ హాలులో నుంచి బయల్దేరిన పవన్ కళ్యాణ్ కు భీమవరం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మేళతాళాలు, బాణసంచా పేలుళ్లతో భీమవరం పట్టణం దద్దరిల్లింది. రోడ్ షోకు వందలాది వాహనాలతో త‌ర‌లివ‌చ్చిన జనసైనికులు జనసేనాని వాహనశ్రేణి వెంట కదిలారు.

రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున యువ‌త‌, ఆడ‌ప‌డుచులు నిల‌బ‌డి జ‌న‌సేన జెండాలు రెప‌రెప‌లాడిస్తూ మ‌ద్ద‌తు తెలిపారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం వాహ‌నంపైకి వ‌చ్చి ప్ర‌తి ఒక్క‌రికి అభివాదం చూస్తూ ముందుకు క‌దిలారు. నామినేష‌న్ దాఖ‌లు చేయ‌డానికి బ‌య‌ల్దేరిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు మ‌ద్ద‌తుగా వామ‌ప‌క్ష పార్టీలు, బీఎస్పీ కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చి రోడ్డు షోలో పాల్గొన్నారు. రోడ్డు షో జ‌రిగినంత సేపు భీమ‌వ‌రం ప్రాంతం జ‌న‌సేన నినాదాల‌తో హోరెత్తింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Bhimavaram assembly constituency  andhra pradesh  politics  

Other Articles