'Internet handling fee' not in compliance with RBI norms అడ్డంగా బుకైన బుక్ మై షో..

Bookmyshow illegally charging internet handling fees while booking movie tickets online

bookmyshow, case against bookmyshow, bookmyshow fee, internet handling fee by bookmyshow, bookmyshow charging fees illegal, pvr, bookmyshow charges illegal, Merchant Discount Rate, ecommerce, india, legal charges, online tickets, technology

A recent suit, filed against BookMyShow, revealed that according to the law we should actually be ‘exempted’ from paying such extra fee while booking a movie ticket because it is in violation of RBI’s Merchant Discount Rate (MDR) Regulation.

అధిక ధరలు వసూలు చేస్తూ.. అడ్డంగా బుకైన బుక్ మై షో..

Posted: 03/15/2019 07:19 PM IST
Bookmyshow illegally charging internet handling fees while booking movie tickets online

సినిమా ప్రియులకు బుక్‌మైషో చాలా సుపరిచితం. ఏదైనా కొత్త సినిమా రిలీజైనా, మూవీ చూడాలనిపించినా వెంటనే మొబైల్ ఫోన్‌‌లోని బుక్‌మైషో యాప్ ఓపెన్ చేస్తాం. టికెట్లు బుక్ చేసుకుంటాం. ఇదంతా బాగానే ఉంది. అయితే బుక్‌మైషో మాత్రం సినిమా టికెట్ బుకింగ్‌కు అదనపు చార్జీలు చేస్తోంది. ఇక్కడే సమస్యే. బుక్‌మైషో ద్వారా మూవీ టికెట్ బుక్ చేసుకుంటే.. సంస్థ సినిమా టికెట్ ధరకు అదనంగా ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు వసూలు చేస్తోంది.

ఇది చట్ట విరుద్ధం. మూవీ టికెట్ బుకింగ్స్ సేవలను అందించే ప్లాట్‌ఫామ్స్‌కు కన్సూమర్ల నుంచి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు వసూలు చేసే అధికారం లేదని ఆర్‌బీఐ తెలిపింది. ఇలా చేస్తే మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్) నిబంధనలను అతిక్రమించినట్లేనని స్పష్టం చేసింది. హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘ ఫోరమ్ అగైనెస్ట్ కరప్షన్’ ప్రెసిడెంట్ విజయ్ గోపాల్‌కు ఆర్‌టీఐ కింద ఈ సమాచారం అందించింది.

మనం ఏదైనా దుకాణానికి వెళ్లి నగదు బదులు క్రెడిట్, డెబిట్ కార్డుతో వస్తువులను తీసుకుంటే.. రెండు శాతం మేర డబ్బును దుకాణాదారులు అదనంగా వసూలు చేస్తాడు. మన వస్తువులు వంద రూపాయల మొత్తం అయితే అతను రూ.102 ను తీసుకుంటాడు. వందే రూపాయలే కదా.. అదనంగా ఎందుకు వసూలు చేస్తున్నావని మనం అడగం. కానీ ఆ రెండు రూపాయల అదనపు డబ్బును దుకాణాదారుడే బ్యాంకులకు చెల్లించాలి.

మన కార్డు లావాదేవీకి గానూ సంబంధిత బ్యాంకుకు కొంత మొత్తాన్ని చెల్లించాలి. దీన్నే ఎండీఆర్ చార్జీలు అంటారు. ఎండీఆర్ చార్జీలకు, కన్సూమర్లకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ చార్జీలను కేవలం షాప్, ఔట్‌లెట్ యజమానులే బ్యాంకులకు చెల్లించాలి. అయితే మూవీ టికెట్ బుకింగ్స్ సేవలు అందించే బుక్‌మైషో వంటి సంస్థలు ఈ చార్జీలను కస్టమర్లకు బదిలీ చేస్తున్నాయి.

కెప్టెన్ మార్కెల్ టికెట్ బుకింగ్‌ను గమనిస్తే టికెట్ ధర రూ310గా ఉంది. అయితే దీనిపై అదనంగా రూ.43.66 చెల్లిస్తున్నాం. ఇది ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీజు. ఇందులో బుకింగ్ ఫీజు రూ.37, ఐజీఎస్‌టీ రూ.6.66. సాధారణంగా మనం రూ.37 చెల్లించాల్సిన అవసరం లేదు. అయినా కూడా బుక్‌మైషో మన నుంచి ఈ డబ్బును వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ గోపాల్ బుక్‌మైషో, పీవీఆర్‌ సంస్థలపై కేసు వేశారు. ఈ కేసు మార్చి 23న విచారణకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bookmyshow  internet handling fee  pvr  Merchant Discount Rate  ecommerce  online tickets  technology  

Other Articles