YS Jagan appeals voter for one chance ఒక్కసారి అవకాశం ఇవ్వండీ.. కాకినాడలో జగన్ అభ్యర్థన..

Ys jagan appeals voters to give his party one chance

Ys Jagan, YSR congress party, Kakinada, ysr congress party samara shankaravam, Chandrababu, TDP, Elections, YSRCP Samara Shankaravam, Kakinada, Andhra Pradesh, politics

YSRCP President YS Jagan appeals voters to his party one chance at kakinada samara shankaravam public meet, he also assures that he will give clean and transperency government to people.

ఒక్కసారి అవకాశం ఇవ్వండీ.. కాకినాడలో జగన్ అభ్యర్థన..

Posted: 03/11/2019 07:36 PM IST
Ys jagan appeals voters to give his party one chance

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా వచ్చే నెల 11న నిర్వహించినున్న నేపథ్యంలో ఈ సారి ఖచ్చితంగా అధికారాన్ని అందుకోవాలని జోరుమీదున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. ఓటర్లను అకట్టుకునేందుకు తన శైలిని, దోరణిని మార్చారు. అధికారపక్షంపై నిత్యం విమర్శలు చేసే జగన్.. కాకినాడ సమరశంఖారావం సభలోనూ టీడీపీ సహా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

దీంతో పాటు తనదైన శైలిలో ఓట్లర్లను ప్రసన్నం చేసుకునేందుకు తన శైలికి భిన్నంగా తన పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. వైసీపీ పార్టీకి ఒక్కసారి అధికారం ఇస్తే అవినీతి లేని, స్వచ్ఛమైన పాలన అందిస్తామన్నారు. సంక్షేమ పథకాలు అందరికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామన్నారు. విలువలు, విశ్వసనీయతకు ఓటేయాలని పిలుపునిచ్చారు.

వైసీపీ 9వ వసంతాలను పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని, తొమ్మిదేళ్లుగా ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేశామని జగన్ అన్నారు. అధికారంలో ఉన్న వాళ్లు వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేశారని జగన్ వాపోయారు. తాము అధికారంలోకి వచ్చాక నమోదైన దొంగ కేసులను ఎత్తివేస్తామన్నారు. ప్రజలకు పారదర్శక పాలనను అందించి.. వారి మన్నన్నలను పోందుతామని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబు పాలనపై జగన్ ఫైర్ అయ్యారు. ఏపీలో అవినీతి పెరిగిపోయిందన్నారు. రాజధానిలో తాత్కాలిక భవనాలు తప్ప ఏమీ కనిపించవన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేశారని అన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎన్నికలకు 3 నెలల ముందు నిరుద్యోగ భృతి ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. చంద్రబాబుని సైబర్ క్రిమినల్ తో జగన్ పోల్చారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ys Jagan  YSRCP  samara shankaravam  Chandrababu  TDP  Elections  Andhra Pradesh  politics  

Other Articles