TDP leader meets with Pawan Kalyan జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్సీ మాగంట.?

Tdp leader magunta srinivasula reddy to join janasena

TDP MLC Magunta Sreenivasulu Reddy to join Janasena, Magunta to join Janasena, Magunta Sreenivasulu Reddy meets Pawan Kalyan in ongole, pawan kalyan, janasena, Magunta Sreenivasulu Reddy, Prakasam, AP politics, andhra pradesh, politics

TDP leader and MLC Magunta Sreenivasulu Reddy have met Jana Sena party chief Pawan Kalyan at Ongole in Prakasam district. It's in the news that Magunta will be quitting TDP and will join the YSR Congress party. By giving a shock to everyone he meets with Pawan Kalyan.

పవన్ కల్యాణ్ తో మాగుంట భేటీ.. జనసేనలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

Posted: 03/05/2019 05:42 PM IST
Tdp leader magunta srinivasula reddy to join janasena

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో ప్రకాశం జిల్లా కూడా కీలకభూమిక పోషిస్తుంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత అధికార, విపక్షాలకు షాక్ ఇస్తూ తాజాగా తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లా పర్యటనలో వున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి ఆయనతో భేటీ అయ్యారు. జిల్లా కీలక నేత, టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఊహించని షాక్ ఇస్తూ.. జనసేనానితో భేటీ కావడం.. జిల్లా రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

టీడీపీ ఎంపీ ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్న తరుణంలో ఆయన బాటలోనే మాగుంట కూడా ప్రయాణిస్తారన్న వార్తలు వచ్చాయి. ఆయన కూడా టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని బావించగా, టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చల తరువాత ఆయన వెనక్కు తగ్గారు. దీంతో ఆయన టీడీపీలోనే కొనసాగుతారని అంతా బావించారు. కాగా, తాను మాత్రం ఈ సారి ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలిచేది లేదని మాగుంట చంద్రబాబుకు క్లారిటీ ఇచ్చారని సమాచారం.

ఈ విషయంలో చంద్రబాబు ఆయనను రాజీపర్చారని వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆయన ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరకున్న పవన్ కల్యాన్ తో భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మాగుంట పవన్ కల్యాణ్ తో భేటీ కావడం ఇది రెండో సారని, శివరాత్రి సందర్బంగా నిన్న బిట్రగుంటలో జరిగిన పూజా కార్యక్రమంలోనూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పవన్ తో భేటీ అయ్యారని, దానికి కొనసాగింపుగానే ఇవాళ మరోమారు ఇద్దరు చర్చలు నిర్వహించారని సమాచారం. అయితే మాగుంట అసెంబ్లీ బరిలోకి దిగాలని భావిస్తున్నారని, ఆయన కోరిన సీటును ఇచ్చిన పక్షంలో జనసేన తీర్థం పుచ్చుకోవడం ఇక లాంఛనమేనని వార్తలు తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  Magunta Sreenivasulu Reddy  Prakasam  AP politics  andhra pradesh  politics  

Other Articles