vandalise mayanmar border based terror camps: pallam raju మయన్మార్ సరిహద్దులోని ఉగ్రశిభిరాలపై ఇదే దాడులు జరపాలి

Pallam raju suggests iaf to vandalise mayanmar border based terror camps

Pallam Raju, mayanmar terror based camps, IAF Air Strikes in Pakistan, Pakistan Air Force's F-16 shot down, Indian Air Force, Pakistan's F-16 jet, Imran Khan, Pak PK Imran Khan Nuclear tops meet, Mohammad Faisal, Pakistan's MoFA spokesperson, PAF undertook strikes across LoC, Pakistani airspace. Pakistan, INDIA, Pak-IND border situation

Former Union minister Pallam Raju suggests Indian Air Force to vandalise pakistan trained mayanmar border based terror camps.

దేశ వాయుసేన తెగువ కూడా ప్రచారస్త్రామా.? ప్రధానికి పళ్లంరాజు ప్రశ్న

Posted: 02/27/2019 03:15 PM IST
Pallam raju suggests iaf to vandalise mayanmar border based terror camps

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను తుదముట్టించడంలో భారత్‌ వాయుసేన ప్రదర్శించిన తెగువ, ధైర్యసాహసాలను కొనియాడుతూ ఇది దేశానికే గర్వకారణమని కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి పల్లంరాజు అన్నారు. ధాయాధి దేశం ఉగ్రవాదులకు స్వర్ఘధామంగా మారిందన్న విషయం అంతర్జాతీయంగా అన్ని దేశాలకు తెలుసునని అన్నారు. ఇక భారత్ లోకి చోరబాట్లకు తెగబడినా.. సరిహద్దు వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడినా.. పర్యావసానం ఎలా వుంటుందో భారత వాయుసేన చూపిందని అన్నారు.

అయితే వాయుసేన సాహసాన్ని తనదిగా ప్రధాని మోదీ ప్రచారం చేసుకోవడమే అభ్యంతకరమని విమర్శించారు. ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ మయన్మార్‌ సరిహద్దుల్లోనూ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద శిబిరాలు చాలా ఉన్నాయని, వాటిపై కూడా దాడులు చేయాలన్నారు. యుద్ధం చేసి గెలిచే సత్తా లేని పాకిస్థాన్‌ అడ్డదారుల్లో భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకుందన్నారు. ఈ విషయం తెలిసే అంతర్జాతీయ ప్రపంచం భారత్‌కు మద్దతు పలుకుతోందన్నారు.

ఈ సర్జికల్‌ స్ట్రయిక్స్‌ భారత్‌ వాయుసేన ధైర్యసాహసాలకు ప్రతిరూపమన్నారు. కానీ మోదీ ధైర్యసాహసాలు కావని ఎద్దేవా చేశారు. అసలు కశ్మీర్‌ ప్రజల మద్దతు కోల్పోవడమే మోదీ పెద్ద వైఫల్యమని విమర్శించారు. పుల్వామా వంటి ఉగ్రదాడులు మితిమీరడానికి ఇదే కారణం అని వ్యాఖ్యానించారు. మోదీ వచ్చాకే భారత ప్రభుత్వంపై కశ్మీర్‌లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ముందు కశ్మీర్‌ ప్రజల మనసు చూరగొనే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేయాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles