Mahesh Babu's AMB booked for GST fraud ప్రిన్స్ మహేష్ బాబుకు జీఎస్టీ అధికారుల షాక్..

Tollywood actor mahesh babu s multiplex allegedly violated gst norms served notice

mahesh babu theater, mahesh babu multiplex rates, mahesh babu multiplex, Mahesh Babu AMB Cinemas, Mahesh Babu, amb cinemas, mahesh babu, AMB Cinemas, multiplex rates, GST norms, AMB tickets price, revised tax rates, GST notices, crime

Actor Mahesh Babu's new theatre AMB Cinemas received a show cause notice from the Ranga Reddy district GST Commissionerate anti-profiteering wing in Telangana for allegedly violating GST norms, by not reducing the price of tickets despite revised tax rates.

మహేష్ బాబుకు జీఎస్టీ అధికారుల షాక్.. నోటీసులు జారీ..

Posted: 02/20/2019 01:24 PM IST
Tollywood actor mahesh babu s multiplex allegedly violated gst norms served notice

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇటీవల కాలంలో వివాదాల్లో చిచ్చుకుంటున్నారు. నటుడిగా తనపని తాను చేసుకుపోతున్న టాలీవుడ్ ప్రిన్స్ ను సినీ వాణిజ్యరంగంలోకి అడుగెపెట్టిన విషయం తెలిసిందే. గచ్చిబౌలిలోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్ లో మహేష్ ఏడు స్ర్కీన్లతో సూపర్ ప్లెక్స్ నిర్మించి.. ఏషియన్ సినిమాస్ తో సంయుక్తంగామహేష్ బాబుకు జీఎస్టీ అధికారుల షాక్.. నోటీసులు జారీ.. ఏఎంబి సినిమాస్ పేరుతో ఈ సినీవ్యాపారాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘ఏయంబీ సినిమాస్‌’ను వివాదం చుట్టేసింది.

కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీ కౌన్సిల్ నిబంధనలను పాటించకుండా పాత ధరలతో ప్రేక్షకుల నుండి అదనపు పన్నులను వసూలు చేస్తుండటంతో ‘ఏయంబీ సినిమాస్‌’‌కి నోటీసులు అందినట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ ఇంగ్లీష్ పేపర్‌లో వచ్చిన కథనం ప్రకారం.. కొత్తగా వచ్చిన జీఎస్టీ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వంద రూపాయల కంటే ఎక్కువ ఉన్న టిక్కెట్ టాక్స్ 28 నుండి 18 శాతానికి తగ్గించారు. 2019 జనవరి 1 నుండి ఈ కొత్త విధానం అమలు చేయాల్సిఉంది.

అయితే ఎఎంబి సినిమాస్ ఈ కొత్త నిబంధలను బేఖాతరు చేస్తున్నారన్న అభియోగం మీద రంగారెడ్డి జీఎస్టీ కమీషనరేట్ నోటీసులు పంపినట్టు తెలుస్తోంది. 2017 జీఎస్టీ యాక్ట్ సెక్షన్ 171 కింద ఈ నోటీసుల్ని పంపినట్టు తెలుస్తోంది. అయితే తనిఖీలు జరిగిన మాట వాస్తమేనని తాము నిబంధలకు లోబడే టిక్కెట్ టాక్స్ వసూలు చేస్తున్నామని.. తమకు ఎలాంటి నోటీసులు అందలేదని ఏయంబీ సినిమాస్‌ పార్టనర్‌ సునీల్‌ మీడియాకి వివరించారు. ఈ వివాదంపై క్లారిటీ రావాల్సిఉంది. ‘ఏయంబీ సినిమాస్‌’‌ బాధ్యతల్ని మహేష్ సతీమణి నమ్రతా శిరోద్కర్ నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  AMB Cinemas  multiplex rates  GST  AMB tickets price  GST notices  Crime  

Other Articles