students detained in US on visa fraud charges అగ్రరాజ్య పోలీసుల అదుపులో 800 మంది భారతీయులు..

Hundreds of indian students face jail deportation in us college scam

indian visa fraus, indian immigration fraud, us fake university indians arrest, indians arrest in us, indians fake university, crime

At least six Indians students have been arrested by the US Department of Homeland Security for committing visa and immigration fraud, which allowed them to stay and work illegally in the country.

అగ్రరాజ్య పోలీసుల అదుపులో 800 మంది భారతీయులు..

Posted: 01/31/2019 01:31 PM IST
Hundreds of indian students face jail deportation in us college scam

అమెరికాలోని నకిలీ యూనివర్సిటీలలో విద్యార్థులుగా తమ పేర్లను నమోదు చేసుకుని.. అక్రమంగా అగ్రరాజ్యంలో తిష్టవేసిన వేలాదిమంది పరాయి దేశస్థుల గుట్టును అగ్రరాజ్యం అధికారులు రట్టు చేశారు. అమెరికాలో డాలర్లలో సంపాదించడమే పనిగా పెట్టుకున్న వీరు.. అక్రమంగా విద్యార్థులుగా చదువుకునేందుకు వస్తున్నట్లుగా వీసాలు పోందడం.. వాటి గడువు తీరిపోయినా అక్కడే తిష్ట వేయడంతో అధికారులు వీరిపై దృష్టిసారించారు.

ఇలా పోలీసుల అదుపులో వున్నవారిలో అనేక మంది తెలుగువాళ్లు కూడా వున్నారని సమాచారం. విద్యార్థులుగా చూపిస్తూ అమెరికాలో నివసించేందుకు సహకరిస్తున్న 8 మంది భారత సంతతికి చెందిన దళారీలను కూడా అదుపులోకి తీసుకున్నారు. డెట్రాయిట్‌లో ఆరుగురిని, వర్జీనియా, ఫ్లోరిడాలో ఇద్దర్ని అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. వీరిని గుట్టుగా పట్టుకునేందుకు అధికారులు కూడా సరికొత్త డ్రామాకు తెరతీసారు.

ఇలా గుట్టు మొత్తాన్ని రాబట్టిన అధికారులు..

విద్యార్థులుగా వీసాలు పొంది.. అక్కడే ఉద్యోగాలు చేస్తూ అనేక మంత్రి పరదేశస్థులు అక్రమంగా తమ దేశంలో తిష్టవేశారన్న పిర్యాదులు రావడంతో అగ్రరాజ్యానికి చెందిన హోంల్యాండ్ అధికారులు వారిని పట్టుకునేందుకు అదే తరహా డ్రామాకు తెరతీశారు. హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్‌ ఓ రహస్య‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఇందులో భాగంగా డెట్రాయిట్ లో ఫర్మింగ్టన్‌ యూనివర్శిటీ పేరుతో నకిలీ యూనివర్శిటీని ఏర్పాటుచేసింది.

ఉన్నత విద్య పేరుతో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న వారిని గుర్తించేందుకు అధికారులు ఈ ఎత్తుగడ వేశారు. అయితే అధికారులు ఎత్తుగడ తెలియని వందలాది మంది అమెరికాలో నివసిస్తున్న భారతీయ యువత ఈ యూనివర్సిటీలో అడ్మీషన్ల కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం 8 మంది దళారులు పనిచేశారు. మొత్తంగా అడ్మీషన్ తేదీలు ముగిసేనాటికి అధికారుల వద్ద మొత్తంగా 900 మంది భారతీయ యువత చిట్టా వచ్చిచేరింది.

నకిలీ యూనివర్శిటీల్లో ప్రవేశాలు ఎందుకు.?

అమెరికాలో నకిలీ యూనివర్శిటీలు తెరపైకి రావడం కొత్తేం కాదు. నకిలీ యూనివర్శీలలో అడ్మీషన్లు పోందిన అనేక మంది భారతీయ విద్యార్థులను గతంలో అగ్రరాజ్యం ఆ దేశం నుంచి వెనక్కు పంపిన ఘటనలు కూడా వున్నాయి. ఇలాంటి నకిలీ యూనివర్శిటీలో ఉన్నత విద్యాను చదివే వంకతో అక్రమమార్గంలో వీసాలు పొంది..అనేక మంది ఆశావహులు సప్తసముద్రాలను దాటి అగ్రరాజ్యంలోకి ఎగిరిపోతున్నారు.

అయితే నకిలీ అయినా అసలీ అయినా అక్కడ విద్యాను అభ్యసించాలి కాదా.? మరి అలాంటప్పుడు ఎలా అంటే.. అసలు ఈ నకిలీ యూనివర్శిటీలో తరగతులు జరగవు. పరీక్షలు వుండవు. కేవలం వారి నుంచి డబ్బు తీసుకుని విద్యార్థులకు‌ వీసాలు ఇస్తారు. ఇలా నకిలీ పత్రాలతో స్టూడెంట్‌ వీసా సాధించిన వారంతా అమెరికాలో నివసిస్తూ.. అక్కడే అక్రమంగా ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిపోతున్నారని అధికారుల దర్యాప్తులో తేలింది.

ఇలా వచ్చిన వారంతా అమెరికాలో దొంగచాటుగా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఇలా ఎందరో విద్యార్థులు వస్తున్నారన్న పిర్యాదులు అందిన క్రమంలో అధికారులు అదే వల పన్ని 900 మంది భారతీయులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని అరెస్టు చేశారు. కలుగులో పొగబెడితే ఎలుకలు బయటకు రావా.? అన్నట్లు నకిలీ యూనివర్సిటీ పేరు చెప్పగానే అక్రమార్కులంతా అక్కడికి చేరి అధికారులకు చిక్కారు.

వందల మంది అరెస్టు..

గత రెండు రోజులుగా అధికారులు సోదాలు చేపట్టి ఈ నకిలీ యూనివర్శటీలో విద్యార్థులుగా చేరిన వందల మంది విదేశీయులను అరెస్టు చేశారు. ఓహైయో, టెక్సాస్‌, జార్జియా, మిస్సోరీ, న్యూయార్క్‌, న్యూజెర్సీ ప్రాంతాల నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులకు సహకరించిన ఎనిమిది మంది భారతీయులను అరెస్టు చేసి డెట్రాయిట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. అయితే మొత్తంగా ఎంతమందిని అరెస్టు చేశారన్న దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కాగా అరెస్టయిన వారిలో కొందరు తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మధ్యవర్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు

అమెరికాలోకి విదేశీ విద్యార్థులను అక్రమంగా తీసుకువచ్చారనే అభియోగాలతో ఎనిమిది మంది మధ్యవర్తులను అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం డెట్రాయిట్‌ పోలీస్ స్టేషన్ వీరిని వుంచిన అధికారులు వారిని విచారిస్తున్నట్లు సమాచారం. మధ్యవర్తులలో భరత్‌ కాకిరెడ్డి (29) (ఫ్లోరిడా), అశ్వంత్‌ నూనె (26) (అట్లాంటా), సురేష్‌రెడ్డి కందాల (31) (వర్జినియా), ఫణిదీప్‌ కర్నాటి (35) (కెంటకీ), ప్రేమ్‌కుమార్‌ రామ్‌పీసా (26) (నార్త్‌ కరోలినా), సంతోష్‌రెడ్డి సామ, (28) (కాలిఫోర్నియా), అవినాష్‌ తక్కళ్లపల్లి (28) (పెన్సిల్వేనియా), నవీన్‌ పత్తిపాటి (29) (డల్లాస్‌) తదితరులు ఉన్నారు. మరో 14మంది తెలుగు విద్యార్థులను కూడా అరెస్టు చేశారని, వీరిలో ముగ్గురు అమ్మాయిలు కూడా ఉన్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles