Hyderabadi killed model for refusing sex! అందుకు అంగీకరించలేదని మోడల్ పై దారుణం..

Photographer killed model mansi dixit for saying no to sex

indian model, Indian aspiring model, model Mansi Dixit, fashion photographer, photographer Syed Muzammil, Mumbai Model death, refusing sexual favours, sexual involvement, photographer, crime

An Indian aspiring model Mansi Dixit, was allegedly murdered by a fashion photographer Syed Muzammil, she was working with for turning down sexual favours.

అందుకు అంగీకరించలేదని మోడల్ పై దారుణం..

Posted: 01/26/2019 05:48 PM IST
Photographer killed model mansi dixit for saying no to sex

మరో మానవ మృగం చేసిన పైశాచికం ఇది. జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఆ అమ్మాయిని.. తన పశువాంచ తీర్చలేదనే కోపంతో దారుణంగా చంపేశాడా రాక్షసుడు. కొన్నాళ్ల క్రితం ముంబైలో ఈ దుర్ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో విస్తుగొలిపే నిజాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో నిందితులు ఆశ్చర్యపరిచే నిజాలు కక్కుతున్నాడు.

గొప్ప మోడల్ కావాలంటూ కలలుగన్న మాన్సీ దీక్షిత్‌కు.. కొన్ని రోజుల క్రితమే ఫొటోగ్రాఫక్ సయ్యద్‌తో పరిచయం అయ్యింది. ఆమెకున్న లక్ష్యాన్నే .. తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. అందమైన ఫొటోలు తీయాలనే నెపంతో ఆమెకు దగ్గరయ్యాడు. ఆమెను లోబర్చుకోవాలనే ఉద్దేశ్యంతో.. ఫొటోలు తీసేందుకంటూ మాన్సీని ఇంటికి పిలిపించుకున్నాడు. అదే సమయంలో తనలోని పశువాంచను బయటపెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కోపంతో రగిలిపోయాడు. స్టూల్‌తో బలంగా తలపై కొట్టాడు. ఆమెపై దాడి చేసి మెడకు లేసును గట్టిగా బిగించి.. రాక్షసంగా ప్రాణాలు తీశాడు.

ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక, మృతదేహాన్ని ఓ సంచిలో కుక్కి.. క్యాబ్ లో తీసుకెళ్లి ముంబైలోని ఓ ఫుట్‌పాత్ మీద వలిలేసి వెళ్లిపోయాడు. సంచిలో మృతదేహాన్ని గమనించిన క్యాబ్ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుణ్ని అతని అపార్ట్‌మెంట్ దగ్గరే అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తాను చేసిన నేరం అంగీకరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : indian model  Mansi Dixit  Murder  fashion photographer  Syed Muzammil  Crime  

Other Articles