govt to change financial year to Jan-Dec కొత్త ఏడాదే కాదు.. ఇకపై ఆర్థిక సంవత్సరం కూడా అదే.!

Financial year likely to be shifted to january december

India financial year, India financial year change, india new financial year, india new fiscal year, January-December financial year,India, financial year, Jan-Dec 31, Apl to Mar 31, PM Modi, Arun Jaitley, Agriculture based financial year

The government will shift the financial year to January-December, from the current April-March pattern. The move is aimed to align it with the agriculture production cycle.

కొత్త ఏడాదే కాదు.. ఇకపై ఆర్థిక సంవత్సరం కూడా అదే.!

Posted: 01/23/2019 11:56 AM IST
Financial year likely to be shifted to january december

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొ్త్త ఏడాదినే.. ఆర్థిక సంవత్సరంగా పరిగణించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే, ఇప్పటివరకూ అమలవుతున్న ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకూ కాకుండా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆర్థిక సంవత్సరంగా నిర్ణయిస్తూ నూతన విధాన్ని అమల్లోకి తీసుకోనుంది. ఈ విషయమై రెండున్నరేళ్ల క్రితమే వార్తలు వచ్చియి.

 అయితే అప్పట్లోనే దీనిని అమలు చేయడానికి పూర్తిగా అధ్యయనం చేసిన మోడీ సర్కార్ ఇక త్వరలోనే ఈ నిర్ణయాన్ని అమలుపర్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ విధానంతో వ్యవసాయ ఉత్పత్తి ఆధారిత అర్థిక సంవత్సరం అమల్లోకి రానుందన్న ప్రచారాన్ని కూడా కేంద్ర చేయాలని భావిస్తోంది. బ్రిటీష్ పాలనలో ప్రారంభమైన సంప్రదాయాలు పోవాలన్న కారణాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

సాధ్యమైనంత త్వరలోనే ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, గతంలో జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులను ఉద్దేశించి మాట్లాడుతున్న వేళ, నరేంద్ర మోదీ ఆర్థిక సంవత్సర కాలాన్ని మార్చే అంశం పరిశీలిస్తున్నామని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.

ఆపై వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకున్న కేంద్రం, ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో బడ్జెట్ ఫిబ్రవరి నెలలో ఆఖరి పనిదినాన పార్లమెంట్ ముందుకు వస్తుండగా, దాన్ని ఫిబ్రవరి 1కి మార్చిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకూ పరిగణనలోకి తీసుకున్న పక్షంలో బడ్జెట్ డిసెంబర్ ఆఖరివారంలోపు పార్లమెంట్ ముందుకు వస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles