KCR's Bitter Rival To Join TRS! కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న వంటేరు

Kcr opponent vanteru pratap reddy to join trs

Vanteru pratap reddy, TRS party, Telangana Congress, CM KCR, Gajwel, MP Ticket, Telangana, telangana politics

Congress senior leader Vanteru Pratap Reddy, who fought a bitter battle with TRS president and CM KCR in Gajwel for the two consecutive terms, is all set to dump the Congress party and join the TRS.

కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్న వంటేరు

Posted: 01/17/2019 08:09 PM IST
Kcr opponent vanteru pratap reddy to join trs

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యమని పదేపదే ప్రకటించిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు పత్రాప్ రెడ్డి రేపు (జనవరి 18) సాయంత్రం గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు బద్దశత్రువు అని ప్రకటించిన వంటేరు.. ఇప్పుడు ఆయన సమక్షంలోనే అధికారికంగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు.

టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసవచ్చిన ఆయన.. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిముగియగానే మరోమారు వలసవెళ్లనున్నారు. తన రాజకీయ జీవితం కోసం వున్న అస్తులన్నీ అమ్ముకున్న ఆయన.. ఇటీవల ఎన్నికలలో కూడా ఓటమిపాలు కావడంతో తనకు రాజకీయ జీవితం కావాలంటే ఇక గెలిచే శత్రువునే అశ్రయించాలని సిద్దాంతాన్ని ఫాలో అవుతున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్‌పై పోటీ చేసి 56 వేల ఓట్లతో ఓటమిపాలయ్యారు.

డిసెంబర్ 7న జరిగిన ఎన్నికల తరువాత సరిగ్గా నెల రోజుల వ్యవధి తరువాత తన దోరణి మార్చుకున్న వంటేరు.. గులాబీ పార్టీలో చేరతున్నారన్న వార్తలు సంచలనంగా మారాయి. ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ సమక్షంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు.. వంటేరు ప్రతాప రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు ముఖ్య అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. దీనికి సంబంధించి ఆయన తన అనుచరులు, అభిమానులతో ఇప్పటికే మాట్లాడినట్లు సమాచారం. కేసీఆర్, హరీశ్ రావుతోనూ మాట్లాడినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles