KCR pays homage to Telangana Martyrs తెలంగాణ అసెంబ్లీ: ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్

Telangana assembly cm kcr taken oath as mla in first session

MLAs oath taking, CM KCR, newly elected MLAs, telangana Assembly, pro-tem speaker, mumtaz khan, Telangana martyrs, Telangana

All newly elected members in the December elections to the 119-member assembly and the nominated member from Anglo-Indian community, taken oath in the newly constituted Telangana assembly on Thursday.

తెలంగాణ అసెంబ్లీ: ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన కేసీఆర్

Posted: 01/17/2019 12:08 PM IST
Telangana assembly cm kcr taken oath as mla in first session

తెలంగాణ అసెంబ్లీకి రెండో పర్యాయ జరిగిన ఎన్నికల తరువాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు నాలుగు రోజుల పాటు సాగనున్నాయి. ఇవాళ్టి నుంచి 20 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాల ప్రారంభం క్రమంలో అసెంబ్లీకి ఎన్నికైన శాసనసభ్యులందరూ ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా సీఎం కేసీఆర్ ప్రమాణం చేసిన తరువాత మహిళా ఎమ్మెల్యేలు.. ఆ తరువాత మిగతా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో క్రితం రోజున రాజ్ భవన్ లో సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ముందు గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం సభ్యులందరికీ జూబ్లీహాల్ లో ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు గురువారం నామినేషన్లు దాఖలు చేయాలని శాసనసభ కార్యదర్శి నోటిఫికేషన్ జారీచేశారు.

స్పీకర్‌గా పోటీ చేయాలనుకొనే సభ్యులు ఇవాళ నామినేషన్ వేయనుండగా, రేపు శుక్రవారం (18న) స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. గవర్నర్ నరసింహన్ 19న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్ లో వేర్వేరుగా చర్చ జరుగనుంది. అనంతరం అసెంబ్లీ, కౌన్సిల్ ధనవ్యాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నాయి.

సీనియర్ ఎవరు.. కొత్తవారెవంటే..

తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారందరిలో సీనియర్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ కొనసాగుతున్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు 8 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ఇక తెలంగాణ అసెంబ్లీకి రెండో పర్యాయం జరిగిన ఎన్నికలలో 23 మంది తొలిసారి శాసనసభ్యులుగా గెలుపొందారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారిలో ఇద్దరు ప్రస్తుత ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.

కేసీఆర్ తర్వాత ముంతాజ్ అహ్మద్ ఖాన్, రెడ్యానాయక్, ఎర్రబెల్లి దయాకరరావులు సీనియర్లు. వయసు రీత్యా చూసుకుంటే అందరికంటే పెద్దవారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఇక అసెంబ్లీలోని పిన్న వయస్కురాలు ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్. ఆమె వయసు 29 ఏళ్లు మాత్రమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLAs oath taking  CM KCR  newly elected MLAs  telangana Assembly  Telangana Politics  

Other Articles