AP police refuse to handover Jagan case details to NIA జగన్ పై దాడి కేసులో మరో ట్విస్టు.. ఎన్ఐఏ షాక్..

Knife attack on jagan vishaka police refuse to handover case details to nia

YS Jagan, NIA officials, AP High Court, vishakapatnam police, ys jagan case investigation details, YS Jagan attacked, YS Jagan Pawan Kalyan, ys jagan vizag airport attack, YS Jagan Governor, YS Jagan Mohan Reddy, YS Jagan srinivas rao, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, andhra pradesh, politics

NIA officials reached vishakapatnam to take over the case of the knife attack on YSRCP President YS Jagan on the directions of AP High court, but, the police refused to hand over the details by saying that they have to take the government’s permission.

జగన్ పై దాడి కేసులో మరో ట్విస్టు.. ఎన్ఐఏ షాక్..

Posted: 01/05/2019 10:56 AM IST
Knife attack on jagan vishaka police refuse to handover case details to nia

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రమంలో జరిగిన కేసులో మరో ట్విస్టు నెలకొంది. రాష్ట్రోన్నత న్యాయస్థానం ఏపీ హైకోర్టు అదేశాల మేరకు జగన్ పై దాడి కేసును దర్యాప్తును స్వీకరించిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు శరవేగంగా కేసు దర్యాప్తును సాగిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో ఈ కేసును విచారణకు ఓ అధికారిని ఏర్పాటు చేయడంతో పాటు అధికారుల బృందం విశాఖకు చేరకుని పోలీసుల నుంచి కేసు దర్యాప్తు వివరాలను కోరింది.

ఇక్కడే జాతీయ దర్యాప్తు బృందం అధికారులకు షాక్ తగిలింది. జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో వివరాలను వెల్లడించేందుకు విశాఖ పోలీసులు నిరాకరించారు. ఈ కేసు వివరాలను జాతీయ దర్యాప్తు బృందం అధికారులకు అప్పగించేందుకు తమకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలని వారు ఎన్ఐఏ అధికారులకు తెలియజేశారు. దీంతో జాతీయ దర్యాప్తు బృందం అధికారులు నిరాశగా వెనుదిరిగారు.

కాగా ఇప్పటికే ఈ కేసు విషయమై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఐఏకు పలు సూచనలు చేసింది. గతేడాది అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగిన క్రమంలో ఆ రోజున అక్కడే వుండి విధులు నిర్వహిస్తున్న సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ నుంచి పిర్యాదును తీసుకుని అక్కడి నుంచి వివరాలను సేకరించి దర్యాప్తును ప్రారంభించాలని అదేశించింది. అయితే ఎన్ఐఏ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా విశాఖ పోలీసుల నుంచి కేసు వివరాలను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles