Chain snatchers posed challenge to Rachakonda police 12 గంటల్లో 12 స్నాచింగులు.. బెంబేలెత్తుతున్న మహిళలు..

Chain snatchers posed challenge to rachakonda police with 12 snatchings in 12 hours

chain snacthers, Gold ornaments, Lecturers colony, LB Nagar, vanasthalipuram, Rachakonda police, Hyderabad, telangana, crime

Chain snatchers posed a challenge to the Rachakonda police. The chain snatchers did 9 snatchings in 12 hours time and created fear among the women in its limits.

రాచకొండ పోలీసులకు చైన్ స్నాచర్ల సవాల్.. 12 గంటల్లో 12 స్నాచింగులు

Posted: 12/27/2018 01:29 PM IST
Chain snatchers posed challenge to rachakonda police with 12 snatchings in 12 hours

హైదరాబాద్ నగరంలో మరోమారు చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఎక్కడా ఎలాంటి చెప్పుకోదగిన అవాంఛనీయ ఘటనలు లేకుండా పూర్తి చేయడంతో ఊపిరి పీల్చుకుంటున్న నగర పోలీసులకు చైన్ స్నాచర్లు సవాల్ విసురుతూ.. 24 గంటల్లో 12 చోరీలతో అలజడి సృషించారు. వరుస చోరీలతో ఎల్బీ నగర్ జోన్ లో స్థానికులను  హడలెత్తిస్తున్నారు. క్రితం రోజున నగరశివారు ప్రాంతాల్లో రెచ్చిపోయారు. ఇవాళ ఉదయం కూడా ఒంటరి మహిళలపై తమ ప్రతాపాన్ని చూపారు.

దీంతో బుధవారం సాయంకాలం నుంచి.. ఇవాళ గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు వరుసగా 12 స్నాచింగ్ లకు పాల్పడ్డారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృధ్ధులను టార్గెట్ చేస్తున్న స్నాచర్ బైక్ పై వచ్చి క్షణాల్లో గోల్డ్ చైన్స్ లాక్కెళ్తున్నారు. ఈ వార్తలతో మహిళలు ఒంటరిగా బయటకు వచ్చేందుకు కూడా జంకుతున్నారు. మరీ ముఖ్యంగా చైతన్యపురి, వనస్థలిపురం, ఎల్బీనగర్ లో ఈ గొలుసు దొంగతనాలు చోటుచేసుకున్నాయి.

నిన్న రాత్రి ఐదు దొంగతనాలు జరిగిన హయత్ నగర్ ప్రాంతంలోనే ఇవాళ ఉదయం కూడా 5 నిమిషాల వ్యవధిలో రెండు చైన్ స్నాచింగ్ లు జరిగాయి. హయత్ నగర్ లెక్చరర్ కాలనీలో ఓ పెళ్లికి వచ్చి ఇంటి బయట నిల్చున్న నల్గొండకి చెందిన లక్ష్మమ్మ అనే మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు దుండగులు. హయత్ నగర్ కుంట్లూర్ రోడ్ లో హనుమాన్ గుడి దగ్గర నిల్చున్న నిర్మల అనే మహిళ మెడలో నుండి 2.5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు దుండగులు.

ఇక వనస్థలిపురంలో మరో చైన్ స్నాచింగ్ జరిగింది. ఉదయం వేళ వాకింగ్ చేస్తున్న ధనలక్ష్మి అనే మహిళ మెడలోంచి 4 తులాల బంగారు చైన్ ను బలవంతంగా లాక్కెళ్లారు చైన్ స్నాచర్లు. ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయాంజల్ లోనూ గొలుసు దొంగతనం కేసు నమోదైంది. వరుస చైన్ దొంగతనాలు జరగడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. చాలా ప్రాంతాల్లో పికెట్స్ పెట్టారు. సీసీ కెమెరాల్లో రికార్డైన అనుమానితుల వీడియోలను పరిశీలిస్తున్నారు. డీసీపీ సంప్రీత్ సింగ్ ఆధ్వర్యంలోని టీమ్… చైన్ స్నాచింగ్ సంఘటనలపై దర్యాప్తు కొనసాగిస్తోంది. బైక్ పై తిరుగుతున్న ఇద్దరు గొలుసు దొంగల వయసు 35 ఏళ్ల లోపు ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles