Reforms not possible by ‘fragile coalitions’: Jaitley సంకీర్ణ ప్రభుత్వాలతో సంస్కరణలు అసాధ్యం: అరుణ్ జైట్లీ

Fragile coalition can t undertake reforms says fm arun jaitley

arun jaitley, narendra modi, government reforms, reforms policy, Ficci, rbi vs government, rbi autonomy, india liquidity crisis, indian economy

Finance minister Arun Jaitley says the industry shouldn’t get distracted by the high-pitched political rhetoric in the run-up to 2019 Lok Sabha elections and defended the Narendra Modi government in the standoff with RBI

సంకీర్ణ ప్రభుత్వాలతో సంస్కరణలు అసాధ్యం: అరుణ్ జైట్లీ

Posted: 12/15/2018 11:50 AM IST
Fragile coalition can t undertake reforms says fm arun jaitley

కేంద్రంలోని బీజేపి ప్రభుత్వానికి అప్పుడే కూటమి సెగ తగిలింది. కేంద్ర అర్థికశాఖ మంత్రి వ్యాఖ్యలే దీనిని ప్రతిభింబిస్తున్నాయి. ఓ వైపు ముందస్తు ఎన్నికలకు వెళ్తామన్న సంకేతాలిస్తూన్న కేంద్ర.. మరోవైపు కూటమి ఏర్పాటయితే దాని ప్రభావం ఓటర్లపై ఎలా వుండబోతుందన్న విషయాన్ని కూడా అవగతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఛాంబర్ అప్ కామర్స్ అండ్ ఇంటస్ట్రీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కూటమి ప్రభుత్వాల హయాంలో దేశంలో ఏ రంగంలోనూ సంస్కరణలు సాథ్యపడవని అన్నారు.

రానున్న సార్వత్రిక ఎన్నికలలో దేశంలోని అన్ని పార్టీలు కలసి ఓ కూటమిగా ప్రజలముందుకు వెళ్లనున్నాయన్న ఆయన, అవన్నీ కలసినా నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేవని అన్నారు. ఇక ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి భారతీయ రిజర్వు బ్యాంకుకు మధ్య నడుస్తున్న వివాదాన్ని కూడా ఆయన సమర్థించారు. ఆర్బీఐ అర్థిక విధానాలను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని అన్నారు. సంస్కరణలు, విధానాల అమలులో భారత్ కు స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు అత్యంత అవసరమని అన్నారు. ప్రస్తుతం 7.8శాతంగా వున్న అర్థిక వృద్దిరేటు మరింత పురోగమించేందుకు స్థిరమైన ప్రభుత్వం దోహదపడుతుందన్నారు.

ప్రస్తుతం కొనసాగుతన్న అనేక సంస్కరణల విధానాలు రెండు దశాబ్దాల పాటు స్థిరంగా అమలు జరిగితేనే వాటి ఫలితాలను మనకు అందుతాయని అన్నారు.సంకీర్ణ ప్రభుత్వాలకు దేశంలో కాలం చెల్లిందని, చిన్నాచితకా పార్టీలు కూడా ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించే పరిస్థితి ఉండడమే ఇందుకు కారణమని అరుణ్‌జైట్లీ అన్నారు. ఉదాహరణకు ఓ రాష్ట్రానికి చెందిన పార్టీ తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ప్రభుత్వాన్ని కూలదోస్తామని బెదిరించే పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితి దేశానికి మంచిది కాదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles