Ashwamedh Yagna For Construction Of Ram Temple అయోధ్యలో రామమందిరం కోసం అశ్వమేధయాగం..

Ashwamedh yagna in ayodhya for the construction of ram temple

Ashwamedh Yagna In Ayodhya For The Construction Of Ram Temple Hindi news, Ashwamedh Yagna In Ayodhya For The Construction Of Ram Temple Latest News, Ashwamedh Yagna In Ayodhya For The Construction Of Ram Temple Breaking News, Ashwamedh Yagna In Ayodhya For The Construction Of Ram Temple

Vishwa vedanta sansthan is performing Ashwamedh Yagna In Ayodhya For The Construction Of Ram Temple, which ends on 4th december.

అయోధ్యలో రామమందిరం కోసం అశ్వమేధయాగం..

Posted: 12/01/2018 01:32 PM IST
Ashwamedh yagna in ayodhya for the construction of ram temple

రామజన్మభూమిలో రమ్యరామ మందిరి నిర్మాణం చేయాలన్న లక్ష్యంతో విశ్వవేదాంత సంస్థాన్ అయోధ్యలోని రామమందిరం వద్ద అశ్వమేధయాగం నిర్వహిస్తుంది. 'ఛలో అయోధ్య' అనే నినాదంతో తన కార్యాచరణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అయోధ్యలో అశ్వమేధయాగాన్ని నిర్వహిస్తోంది. ఈరోజు ప్రారంభమైన యాగం నాలుగు రోజుల పాటు కొనసాగి 4వ తేదీన ముగియనుంది. దేశంలోని అందరు ప్రజలు ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా రామమందిర నిర్మాణం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని ఈ సంస్థ అభిప్రాయపడింది.

ఈ సందర్భంగా విశ్వవేదాంత సంస్థాన్ అధికార ప్రతినిధి ఆనంద్ జీ మహారాజ్ మాట్లాడుతూ, రామమందిర నిర్మాణ నినాదంతోనే దేశంలో బీజేపి పార్టీ ఎదిగి.. నేడు పార్లమెంటు ఉభయసభల్లో మెజారీటీతో కొనసాగే స్థాయికి చేరకుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి. రామ మందిర నిర్మాణం కోసం తమ ఆందోళనను ఉద్ధృతం చేశామని తెలిపారు. తమ ఆందోళన ప్రజా ఆందోళనగా మారడాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు. అయోధ్యలో ఆలయ నిర్మాణం తప్పక నిర్మించాలన్నారు.

దేశంలో బీజేపి పూర్తి మెజారిటీతో వున్న ఇటువంటి పరిస్థితిలో కూడా జాప్యం జరుగుతుండటం సరికాదని అన్నారు. ఇక ఇప్పుడు నిర్మించలేకపోతే ఆలయ నిర్మాణం ఎప్పటికీ కాదన్న అందోళన తమలో వుందని అన్నారు. ఆలయ నిర్మాణం తేదీని ప్రధాని మోదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అశ్వమేధయాగంలో 1000 మంది రుత్విక్కులు పాల్గొంటున్నారని చెప్పారు. 11,000 మంది సాధువులు హాజరవుతున్నారని తెలిపారు. ఆలయ నిర్మాణానికి ఈ యాగమే తొలి అడుగని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ashwamedh Yagna  Ayodhya  Ram Temple  Construction  Uttar pradesh  BJP  Politics  

Other Articles