SC issues notice to Baba Ramdev యోగా గురు బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు నోటీసులు

Sc issues notice to baba ramdev on book publisher s plea against hc order

Supreme Court, Baba Ramdev, book Ramdev, Ramdev, Delhi High Court, Juggernaut Books, Godman To Tycoon, Kapil sibal, justice Madan B Lokur, justice Deepak Gupta, Amazon India, Flipkart Internet, Yoga guru's life, life of Baba Ramdev, SC notice Ramdev, national politics

The Supreme Court issued notice to Yoga guru Ramdev on a plea by a publisher challenging the Delhi High Court's verdict restraining sale and publication of a book purportedly on his life.

యోగా గురు బాబా రాందేవ్ కు సుప్రీంకోర్టు నోటీసులు

Posted: 11/30/2018 05:23 PM IST
Sc issues notice to baba ramdev on book publisher s plea against hc order

ప్రముఖ యోగా గురు, స్వయం ప్రకటిత దైవాంశసంభూతుడిగా వెలుగొందుతున్న బాబా రాందేవ్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రముఖ పుస్తక ప్రచురణ సంస్థ జుగ్గెర్నాట్.. బాబా రాందేవ్ పై ప్రచురించనున్న పుస్తకాన్ని నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు సహా కిందికోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ దేశఅత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం బాబా రాందేవ్ కు నోటీసులు పంపింది.

వివరాల్లోకి వెళ్తే, జుగ్గెర్నాట్ బుక్స్ అనే సంస్థ బాబా రాందేవ్ జీవితంపై 'గాడ్ మ్యాన్ టు టైకూన్' పేరుతో పుస్తకాన్ని రూపొందించింది. స్వయం ప్రకటిత దైవాంశ సంభూతుడు నుంచి వ్యాపార దిగ్గజంగా మారిన ఆయన జీవిత విశేషాలను ఈ పుస్తకంలో పొందుపర్చనుంది. అయితే, ఈ పుస్తకంలో తన ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలున్నాయని... తన గౌరవానికి, ఆర్థిక ప్రయోజనాలకు ఇవి భంగం కలిగిస్తాయని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టును రాందేవ్ ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ప్రచురించడం, విక్రయించడం చేయరాదని గత నెల 29న హైకోర్టు ఆదేశించింది. దీంతో, ప్రచురణకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు రాందేవ్ బాబాకు నోటీసులు జారీ చేస్తామని తెలిపింది. అయితే పిటీషనర్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఇంటర్ నెట్ సంస్థలను కూడా చేర్చడంతో ఆయా సంస్థలకు నోటీసులు అందజేయాల్సిన అవసరం లేదని తెలిపిన జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్  సుప్రీంకోర్టు ధర్మాసనంతదుపరి విచారణను ఫిబ్రవరి 3వ తేదీకి వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Baba Ramdev  Juggernaut Books  Godman To Tycoon  notices  

Other Articles