Centre Wanted Sajad Lone as CM: J&K Governor మోడీ రాజకీయ లాభాపేక్షను బయటపెట్టిన సత్యపాల్

Centre wanted me to appoint sajad lone as cm j k governor satyapal malik

Jammu and Kashmir, Sajad Lone, Satyapal Malik, Mehbooba Mufti, Omar Abdullah, PDP, NC, BJP, Congress

Narendra Modi-led Centre wanted me to appoint Sajad Lone as the chief minister of Jammu and Kashmir, revealed Governor Satya Pal Malik on Tuesday.

కేంద్రం నిజాయితి, ఒత్తిడిని బయటపెట్టిన సత్యపాల్

Posted: 11/27/2018 03:28 PM IST
Centre wanted me to appoint sajad lone as cm j k governor satyapal malik

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అత్యంత నీతి, నిజాయితీగా, ఎలాంటి రాజకీయ అపేక్ష లేకుండా పాలనను అందిస్తుందని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ఇవాళ తెలంగాణ వచ్చి తమ ప్రభుత్వ గోప్పలు చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రభుత్వ నిజాయితీ, నిబద్దత, రాజకీయ అపేక్ష ఎలాంటిదో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇవాళ రట్టు చేశారు. కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం తనపై ఎలాంటి ఒత్తడి చేసిందో ఆయన వివరించారు.

ఇప్పటికే మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను తన అధీనంలోకి తీసుకుని వాటిపై తమ అధిపత్యం చెలాయిస్తుందని విపక్షాలు అరోపణలు చేస్తున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచివుందని అరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇక స్వయం ప్రతిపత్తి సంస్థలు ఆదాయపన్ను శాఖ, సీబిఐ, ఈడీలను కూడా కేంద్రం ప్రభావితం చేసి అధిపత్యం చేలాయిస్తుందని పత్రిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అయితే తాజాగా కేంద్రప్రభుత్వం ఎంతటి ఒత్తిడులను తీసుకువస్తుందో స్పష్టంగా తెలియజేశారు జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీని ఉన్నపళంగా రద్దు చేసి సంచలనం సృష్టించిన ఆయన.. తాజాగా మరోసారి ప్రకంపనలు పుట్టించారు. తాను అసెంబ్లీని రద్దు చేసే ముందు తనపై కేంద్రం ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చిందని ఆయన చెప్పారు. ఆ రోజు తాను ఎలాంటి ఒత్తిళ్లకు లొంగలేదని కూడా ఆయన స్పష్టం చేశారు.

మహబూబా ముఫ్తీ ప్రభుత్వాన్ని జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ నుంచి పంపించి.. ఆ స్థానంలో సజ్జాద్ లోన్ ను ముఖ్యమంత్రిగా నియమించాలంటూ తనపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిన విషయం నిజమేనని ఆయన కుండబద్దలు కొట్టారు. కేంద్ర ఒత్తిడికి తాను లొంగిలేదని.. అందుకనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సజ్జాద్ ను తాను ఆహ్వానించలేదని చెప్పారు. కేంద్రం ఒత్తడికి తాను లొంగి ఉంటే... నిజాయతీ లేని వ్యక్తిగా తాను చరిత్రలో నిలబడాల్సి వచ్చేదని అన్నారు. తనపై వస్తున్న విమర్శలపై తాను బాధపడటం లేదని సత్యపాల్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jammu and Kashmir  Sajad Lone  Satyapal Malik  Mehbooba Mufti  Omar Abdullah  PDP  NC  BJP  Congress  

Other Articles