SC rejects plea for use of ballot paper instead of EVM బ్యాలట్ పేపర్ల వ్యవస్థను పునరుద్దరించాలన్న పిల్ తిరస్కరణ

Sc dismisses pil seeking use of ballot papers in assembly ls polls

Supreme Court, Electronic Voting Machine (EVM), Ballot Paper, EVM hacking, UIDAI, Aadhaar

CJI- led Supreme Court bench on Thursday rejected a plea seeking direction to EC to conduct assembly elections and Lok Sabha polls next year using ballot papers instead of EVM.

బ్యాలట్ పేపర్ల వ్యవస్థను పునరుద్దరించాలన్న పిల్ తిరస్కరణ

Posted: 11/22/2018 04:52 PM IST
Sc dismisses pil seeking use of ballot papers in assembly ls polls

ప్రస్తుతం జరుగుతున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను మినహాయించి.. త్వరలో జరగనున్న రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటర్ల తీర్పు దుర్వినియోగం కాకుండా.. ఓటరునాడిని నూటికి నూరు శాతం పరిగణలోకి తీసుకుని ప్రజాప్రభుత్వాలను అధికారంలోకి తీసుకువచ్చేలా.. ప్రజాస్వామ్యాన్ని పరఢవిల్లేలా చేయాలని.. అందుకు ఈవీఎం యంత్రాలకు బదులు.. మళ్లీ పురాతన ఓటింగ్ వ్యవస్థలో వినియోగించిన బ్యాలెట్ పేపర్లను వినియోగించాలన్న ప్రజాప్రయోజన వాజ్యాం తెరపైకి వచ్చింది.

రాజస్థాన్, తెలంగాణ శాసనసభలకు డిసెంబర్ 7న జరుగుతున్న ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లను వినియోగించాలని.. వీటితో పాటుగా ఆ తరువాత రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎం బదులు బ్యాలెట్ పేపర్లు వినియోగించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ‘న్యాయ్ భూమి’ అనే ఎన్జీవో సంస్థ వేసిన ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారించింది.

ఓటింగ్ మెషీన్లను దుర్వినియోగం చేసే అవకాశం ఉందనీ.. స్వేచ్ఛాయుత, పారదర్శక విధానంలో ఎన్నికలు జరిపేందుకు అవకాశం లేని ఈ యంత్రాలను వినియోగించరాదని పిటిషనర్ వాదించారు. అయితే ఈ వాదనతో ధర్మాసం ఏకీభవించలేదు. ‘‘ప్రతి వ్యవస్థను, ప్రతి యంత్రాన్ని సద్వినియోగం చేయడానికి, దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది. అన్నిచోట్లా అనుమానాలు ఉంటాయి..’’ అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Supreme Court  Electronic Voting Machine (EVM)  Ballot Paper  EVM hacking  UIDAI  Aadhaar  

Other Articles