Nearly half of India's ATMs may close by March 2019 అప్పుడు నోట్ల ఇక్కట్లు.. త్వరలో ఏటీయం ఇక్కట్లు..

Nearly 50 atms may be permanently closed by march 2019

atms in india, atms near me, atms in my city, india rupee, indian currency

A CATMi spokesperson said that there are over 2,38,000 ATMs in India out of which nearly 1,13,000 ATMs are expected to shut down by March of next year. Out of the 1,13,000 machines, 1,00,000 are off-site while the rest of them are white label ATMs.

అప్పుడు నోట్ల ఇక్కట్లు.. త్వరలో ఏటీయం ఇక్కట్లు..

Posted: 11/21/2018 08:42 PM IST
Nearly 50 atms may be permanently closed by march 2019

నెల ప్రారంభంలో జీతం పడిందంటే చాలు... డబ్బులొచ్చే ఏటీఎంను వెతుక్కుంటూ పరుగెడతాం. డబ్బులు వస్తున్నాయంటే చాలు సంతోషంతో గంటసేపైనా సరే క్యూలో నిల్చొని ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేసుకుంటాం. నోట్ల రద్దు తర్వాత ఏటీఎంల వద్ద నిల్చున్న జనాలను చూసి ప్రపంచమే షాక్ గురైంది. అయితే దాన్ని ఎలాగోలా తట్టుకున్న భారతీయులకు ఇప్పుడు మరోక గట్టి షాక్ తగలనుంది. దేశంలో ఉన్న సగం ఏటీఎంలు త్వరలో మూతబడబోతున్నాయి. మెల్లిమెల్లిగా ఏటీఎంలు మూసివేస్తూ వస్తున్న బ్యాంకులు... వచ్చే ఏడాది మార్చి నాటికల్లా సగం ఏటీఎంలను ఎత్తివేయబోతున్నాయి.

బ్యాంకింగ్ చట్టంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న నష్టాల కారణంగా ఏటీఎంల నిర్వహణ భారంగా మారింది. అదీగాక బ్యాంకింగ్ కార్యకలాపాల్లో పటిష్ట నియంత్రణ తీసుకురావాలనే ఆలోచన సైతం ఉంది. ఇందులో భాగంగా లెక్కకు మించి ఉన్న ఏటీఎంలను వీలైనంత త్వరగా మూసివేయాలని నిర్ణయించింది కాన్ఫడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ. ఒకేసారి భారీ సంఖ్యలో ఏటీఎంలను మూసివేస్తే ఆ ప్రభావం లక్షల మందిపై పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఏటీఎంల దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ నిరుద్యోగులవుతారు. అదీగాక డిజిటల్ కార్యకలాపాలు పెంచాలనుకుంటున్న ప్రభుత్వ ఆలోచనలకు బ్రేక్ పడుతుంది. అయినా వచ్చే ఏడాది మార్చినాటి కల్లా దేశవ్యాప్తంగా దాదాపు ఒక లక్షా 13 వేల ఏటీెంలను సర్వీస్ ప్రొవైడర్లు బలవంతంగా మూసివేయాల్సి రావచ్చని ఏటీఎం ఇండస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో లక్ష ఏటీఎంలు ఊరికి దూరంగా, మారుమూల పల్లెల్లో ఉన్న ఏటీఎంలే ఉండడం విశేషం.

వీటిని మూసివేస్తే ప్రభుత్వ సబ్సిడీలను తీసుకునే గ్రామప్రజలు ఇబ్బందుల్లో పడతారు. కొత్త కరెన్సీ నోట్ల కారణంగా ఏటీఎం మెషిన్లలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేయడం, క్యాష్ లోడింగ్‌కు అనుసరిస్తున్న క్యాసెట్ స్వాపింగ్ పద్ధతి కూడా మార్చాల్సిరావడంతో ఖర్చు భారీగా పెరిగిపోయిందట. కొత్త టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసేందుకే రూ. 3 వేల కోట్లు అదనంగా ఖర్చవుతోందని అంచనా వేసింది సీఏఏఐ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : atms in india  atms near me  atms in my city  india rupee  indian currency  

Other Articles