SC adjourns alok varma case hearing to November 29 సీబిఐ కేసులో పరిణామాలపై ‘సుప్రీం’ ఫైర్

Supreme court adjourns alok varma case hearing to november 29 over alleged leaks

supreme court, CBI, CVC, CBI News, CBI vs CBI, CBI case, CBI chief, CBI full form, CBI FIR, Alok Verma, rakesh asthana, rakesh asthana news, leaks, CJI Ranjan Gogoi, supreme court judgement, supreme court hearing today, supreme court news

The Supreme Court on Tuesday adjourned the hearing in the ongoing infighting in CBI involving its Director Alok Kumar Varma and his deputy Rakesh Asthana to November 29.

సీబిఐ కేసు పరిణామాలపై ‘సుప్రీం’ ఫైర్, వాయిదా వేసిన ధర్మాసనం

Posted: 11/20/2018 01:26 PM IST
Supreme court adjourns alok varma case hearing to november 29 over alleged leaks

సీబీఐ డైరెక్టర్ అలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా వేస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్నపళంగా తనను పక్కనబెట్టి.. బలవంతపు సెలవుపై పంపించిందని అలోక్ వర్మ దాఖలు చేసిన పిటీషన్ విషయంలో ఇరుపక్షాలు పత్రికలకు లీకులు ఇవ్వడంలో బిజీగా వున్నాయని అగ్రహాన్ని వ్యక్తం చేసింది. సీవీసీ సీల్డ్‌ కవర్‌లో ఇచ్చిన ప్రాథమిక దర్యాప్తు నివేదికతో పాటు, అలోక్ వర్మ ఇచ్చిన సమాధానం కూడా మీడియాలో లీకైనట్టు తెలియడంతో సుప్రీం ధర్మాసనం ఇలా వారిపై ఫైర్ అయ్యింది.  

సీవీసీ నివేదికపై సమాధానం చెప్పేందుకు మరింత సమయం కావాలంటూ సోమవారం ఎందుకు అడిగారని కూడా వర్మ తరపు న్యాయవాది ఫాలి నారీమన్ ను సుప్రీం ప్రశ్నించింది. కాగా సీవీసీ నివేదికపై సమాధానం చెప్పేందుకు తన క్లయింటు అదనపు సమయం అడగలేదని నారీమన్ తెలిపారు. దీనిపై భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ స్పందిస్తూ.. ‘‘ఇవాళ మాకు వాదనలు వినిపించే అర్హత మీలో ఎవరికీ లేదు..’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుపై విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
 
అలోక్ వర్మ పిటిషన్ పై ప్రస్తుతం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. సుప్రీం కోర్టుకు రహస్యంగా నివేదించిన సీవీసీ నివేదికలోని ఓ భాగంతో పాటు వర్మ సమాధానం సోమవారం రాత్రి  ఓ జాతీయ మీడియా వెబ్‌సైట్‌లో ప్రచురితం అయ్యాయి. తెల్లారే దీనిపై విచారణ జరగనున్న దృష్ట్యా ఈ వ్యవహారంపై ఒక్కసారిగా కలకలం రేగింది. కాగా సీవీసీ నివేదికలో వచ్చిన అవినీతి ఆరోపణలపై ‘‘సాధ్యమైనంత త్వరగా’’ స్పందన దాఖలుచేయాలంటూ సుప్రీంకోర్టు నిన్న అలోక్ వర్మను ఆదేశించిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళవారమే దీనిపై విచారణ చేపడతామని, వర్మ సమాధానం కోసం మరింత సమయం ఇవ్వడం కుదరదని కూడా స్పష్టం చేసింది.
 
కాగా వర్మపై ఆరోపణలు చేసిన సీవీసీ నివేదికను చదివేందుకు గతవారం సుప్రీంకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఈ నివేదికలోని విషయాలను రహస్యంగా ఉంచాలని సుప్రీంకోర్టు ఆయనకు స్పష్టంగా చెప్పింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ సీబీఐ డైరెక్టర్ రాకేశా అస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో ఇరువురి మధ్య వైరం నెలకొంది. ఈ పరిణామాలు సీబీఐలో అంతర్యుద్ధానికి తెరతీయడంతో.. కేంద్ర ప్రభుత్వం వీరిద్దరినీ దీర్ఘకాలిక సెలవుపై పంపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ సుప్రీకోర్టును ఆశ్రయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  CBI  CVC  Alok Varma  rakesh asthana  leaks  CJI Ranjan Gogoi  

Other Articles