nomination process completed in Telangana ముగిసన నామినేషన్ల ఘట్టం.. ప్రారంభంకానున్న పరిశీలన పర్వం..

Telangana assembly elections nomination process completed

telangana elections 2018, Telangana assembly notification, Telangana election officers, ts election notification, Telangana assembly elections, nominations, scrutiny, nomination withdrawls, Telangana CEO, auspicious dads, candidates nominations, sentiments

Telangana election nominations begins with the issue of election commission notification ends today. Now its the time for candidates to withdraw their nomination.

ముగిసన నామినేషన్ల పర్వం.. ప్రారంభంకానున్న పరిశీలన పర్వం..

Posted: 11/19/2018 03:53 PM IST
Telangana assembly elections nomination process completed

తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గత సోమవారం (నవంబర్ 11న) నోటిఫికేషన్ విడుదల చేయడంతో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ.. ఈ సోమవారం 19 మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసింది. మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాలకు గానూ ఒకే విడతలో డిసెంబరు 7న పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. షెడ్యూల్‌ ప్రకారం నోటిఫికేషన్‌ జారీ అయి రోజు నుంచే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం ప్రారంభించారు.

తొలిరోజున అధికంగా బీజేపి అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారని సమాచారం. ఇక అభ్యర్థులందరూ ఎన్నికల నేపథ్యంలో తమ సెంటిమెంట్లకు, శుభముహూర్తాలకు అధికప్రాధాన్యత ఇస్తున్నారు. శుభసమయం చూసుకుని అమృత ఘడియలు వున్న సమయంలో తిథులును పాటించి మరీ తమ నామినేషన్లను సమర్పించారు. ఇక చివరి రోజైన సోమవారం ఏకాదశి కావడంతో అభ్యర్థులు ఇవాళే అధిక సంఖ్యలో తమ నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పించినట్లు తెలుస్తుంది.

ఇక అన్ని పార్టీల అభ్యర్థులు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. తమకు విజయాన్ని అందించాలని భగవంతుడి అశీస్సులను పొందిన తరువాతే నామినేషన్లకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. చివరి క్షణం వరకు వేచిచూసిన మహాకూటమి అభ్యర్థులు ఇవాళ్టి వరకు వేచిచూసి టికెట్లు లభించిన అభ్యర్థులు కూడా ఇవాలే తమ నామినేషన్లను దాఖలు చేయగా, రానీ వారు రెబెల్స్ గా బరిలోకి దిగారు. ఇక రెండు రోజుల పాటు పరిశీలన ప్రక్రియ కొనసాగనుంది.

ఈ క్రమంలో అభ్యర్థులపై అభ్యంతరాలను కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్వీకరించనున్నారు. ఏదేని అభ్యర్థిపై ఓటర్ల నుంచి వ్యక్తమయ్యూ అభ్యంతరాలపై కూడా విచారించనున్నారు. ఇక అభ్యర్థులు ఏదేని కారణం చేతనైనా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలంటే ఈ నెల 22 వరకు సమయం వుంది. ఈ సమయంలో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని భావించే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఈ ప్రక్రియ కూడా ముగిసిన తరువాత మొత్తంగా ఏయే నియోజకవర్గాలకు ఎంతమంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలచారన్న వివరాలు వెల్లడికానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana election notification  Telangana CEO  nominations  scrutiny  withdrawls  sentiments  

Other Articles