R Krishniah gets Miryalaguda Assembly మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి ఆర్.కృష్ణయ్య

Congress names krishnaiah from miryalguda

r. krishnaiah, miryalaguda assembly, sitting TDP MLA, BC welfare leader, congress, huzurabad constituency, patancheru constituency, tdp, tjs, telangana, policitics

Telanagana Congress announced the list of six candidates late on Sunday and the surprise inclusion was of Backward Classes leader R. Krishnaiah who will contest from Miryalaguda constituency.

మిర్యాలగూడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి ఆర్.కృష్ణయ్య

Posted: 11/19/2018 11:59 AM IST
Congress names krishnaiah from miryalguda

గత ఎన్నికలలో టీడీపీ తరుపున ఫోటీ చేసి ఎల్బీనగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన.. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అర్.కృష్ణయ్య ఈ సారి న్నికలలో కాంగ్రెస్ ఖండువా కప్పుకున్న క్షణాల్లో ఆయనను కాంగ్రెస్ టిక్కెట్ వరించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తన సర్వశక్తులోడ్డి తన కుమారుడికి ఎన్నికల బరిలో దింపేందుకు తుదివరకు ప్రయత్నాలు చేసినా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం అదే సీటును అర్ కృష్ణయ్యకు కేటాయించి అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కృష్ణయ్యతో కాంగ్రెస్ గేమ్స్..

కాంగ్రెస్ పార్టీలో తాను చేరడానికి సమ్మతిస్తూనే.. ఇటీవల కాంగ్రెస్ జాబితాలను చూసిన బిసి నేత అర్ కృష్ణయ్య.. కాంగ్రెస్ బిసీలకు అన్యాయం చేస్తుందని, తాను డిమాండ్ చేసిన సంఖ్యలో బిసిలకు టికెట్లు కేటాయించలేదని విమర్శించారు. ఈ క్రమంలో ఈ నెల 17న తెలంగాణ బంద్ కు కూడా పిలుపునిచ్చారు. అయితే చివరి క్షణంలో బంద్ ను నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న కృష్ణయ్యకు కాంగ్రెస్ నుంచి హామీ లభించిందని.. ఈ క్రమంలో బిసిలకు న్యాయం చేస్తామని కూడా పార్టీ నేతలు హామి ఇచ్చారని సమాచారం.

అయితే అర్ కృష్ణయ్యకు బిసిలకు న్యాయ చేస్తామన్న హామీతో పాటు టికెట్ కూడా కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో బిసిలను తమవైపుకు అకర్షించు కోవచ్చని భావించింది. అదే సమయంలో అర్ కృష్ణయ్యతో బిసి కార్డుకు చెక్ పెట్టాలని కూడా భావించిందా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఓ వైపు జానారెడ్డికి మంచి పట్టున్న స్తానంలో కృష్ణయ్యకు సీటును కేటాయించడం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

దీంతో ఆయన కృష్ణయ్యకు మద్దతు ఇస్తారా.? అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక అదే స్థానం నుంచి ప్రజాకూటమిలోని మిత్రపక్షమైన టీజేఎస్ కూడా తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించడం.. ఈ క్రమంలో అక్కడ స్నేహపూర్వక పోటీ ఏర్పడింది. దీంతో ఓట్లు చీలడంతో ఎవరి లబ్ది చేకూరుతుందన్న విషయాన్ని పక్కడబెడితే.. కృష్ణయ్యకు మాత్రం మిర్యాలగూడ నల్లేరు మీద నడకకాదని బిసి కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

కృష్ణయ్యకు టికెట్ కేటాయింపుపై రుసరుసలు

ఆర్.కృష్ణయ్యకు కాంగ్రెస్ తుదిజాబితాలో చోటు దక్కడంపై ఇటు కాంగ్రెస్, అటు మహాకూటమి నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చేరకుండానే ఆయనకు మిర్యాలగూడ టికెట్ కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న పలువరు కాంగ్రెస్ సీనియర్ నేతలు, టికెట్ల అశావహులు తెలంగాణ నాయకత్వంపై రుసరుసలు అడుతున్నారు. మిర్యాలగూడ టికెట్‌ను తన బంధువుకు ఇప్పించుకునేందుకు సీనియర్ నేత జానారెడ్డి విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆశావహులకు మొండిచెయ్యి చూపిన అధిష్ఠానం పార్టీలో చేరని వారికి టికెట్ ఇవ్వడమేంటని నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : r. krishnaiah  miryalaguda  sitting TDP MLA  BC welfare leader  congress  Telangana  policitics  

Other Articles