chintamaneni apologises to TDP leader చింతమనేనికి ఎదురుదెబ్బ.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Chandrababu warns mla chintamaneni prabhakar

chintamaneni apologizes rangarao, chandrababu warns chintamaneni, chintamaneni rude behaviour, chintamaneni prabhakar, denduluru, TDP MLA, Warning, apology, Chandrababu, Andhra pradesh, politics

The west godavari denduluru Mla chintamaneni men thrashes his own party leader and sarpanch of a village, after apologizing on the incident, he got a strong warning from party chief chandrababu.

చింతమనేనికి ఎదురుదెబ్బ.. చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Posted: 11/17/2018 12:37 PM IST
Chandrababu warns mla chintamaneni prabhakar

ప్రభుత్వ సిబ్బంది, అధికారులు, ప్రతిపక్ష పార్టీ నేతలే కాదు తాజాగా సొంత పార్టీ నాయకుడిపైనా తన ధోరణి అదేనంటూ నిరూపించుకున్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ తరహా ఘటనలు పునరావృతం అయితే సబబుగా వుండదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన అనుచరులు పెదవేగి మాజీ సర్పంచ్, టీడీపీ నేత సాంబశివ కృష్ణారావుపై దాడి చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పబట్టారు.

చింతమనేని ప్రభాకర్ తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు.. ఎమ్మార్వో వనజాక్షి కేసు మొదలు అనేక పర్యాయాలు నచ్చజెప్పినా ఆయన తీరుమారండం లేదని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీకి చెడ్డపేరు తెచ్చేలా చింతమనేని వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరి తీరు వల్ల మొత్తం పార్టీకి చెడ్డపేరు అపాదించేలా ఆయన వ్యవహారం వుందని వ్యాఖ్యానించిన టీడీపీ అధినేత.. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని అది తప్పితే ఎంతటి నేతకైనా భవిష్యత్ ఉండదని ఆయన హెచ్చరించారు.

అసలు కారణమేంటంటే..

ఎమ్మెల్యేగా తన పదవీకాలం ముగుస్తున్న సమయంలో చింతమనేనికి ఈసారి విభిన్న పరిస్థితి ఎదురైంది. గ్రామస్థులు ఎదురుతిరగడంతో ఆయన తొలిసారిగా క్షమాపణ చెప్సాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... పెదపాడు మండలం దాసరిగూడెంలో శుక్రవారం జరిగిన గ్రామదర్శిని కార్యక్రమానికి చింతమనేని హాజరయ్యారు. సభకు  దాసరిగూడెం తాజా మాజీ సర్పంచ్‌ పామర్తి పెదరంగారావు కూడా హాజరయ్యారు. ఓ వ్యక్తికి ఉపాధి రుణం మంజూరు అంశం సభలో ప్రస్తావనకు వచ్చింది.

ఈ సందర్భంగా చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. ‘వాడికి రుణం మంజూరు చేయాలని నీకెవడు సిఫార్సు చేయమన్నాడు?, గ్రామంలో నాకు తెలియకుండా పింఛన్లు ఎందుకు మంజూరు చేయిస్తున్నావ్‌?’ అంటూ అసభ్య పదజాలం అందుకున్నారు. రంగారావు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోకుండా అతనిపై చెయ్యి చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన రంగారావు వెంటనే అక్కడి నుంచి తన స్వగ్రామమైన వేంపాడు వెళ్లిపోయారు. విషయం గ్రామస్థులకు చెప్పడంతో వారంతా ఆగ్రహంతో రగిలిపోయారు.

గ్రామంలో ఏర్పాటుచేసి ఉన్న పార్టీ ఫ్లెక్లీలను తగుబెట్టారు. కాసేపటికి గ్రామదర్శిని కార్యక్రమం ముగించుకుని వస్తున్న చింతమనేని వాహనాన్ని అడ్డుకున్నారు. క్షమాపణ చెబితేగాని కదలనిచ్చేది లేదని పట్టుబట్టారు. దీంతో చింతమనేని ఓ మెట్టు దిగి ‘రంగారావు నాకు తమ్ముడి లాంటివాడు, ఏదో ఆగ్రహంలో అలా చేశాను’ అని సంజాయిషీ ఇచ్చినా గ్రామస్థులు సంతృప్తి చెందలేదు. పరిస్థితి గమనించిన ఎమ్మెల్యే, రంగారావుకు మూడు సార్లు క్షమాపణ చెప్పారు. ఈలోగా విషయం తెలుసుకుని గ్రామానికి వచ్చిన పోటీసుల సాయంతో ఊరి నుంచి బయటపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chintamaneni prabhakar  denduluru  TDP MLA  Warning  apology  Chandrababu  Andhra pradesh  politics  

Other Articles