HC to hear YS Jagan murder attempt case on Nov 6 జగన్ పిటీషన్ నవంబర్ 6కు వాయిదా వేసిన హైకోర్టు

Hc to hear ys jagan murder attempt case on nov 6

YS Jagan, YS Jagan attacked, High court, YS Jagan High court, YS Jagan Pawan Kalyan, ys jagan vizag airport attack, YS Jagan Governor, YS Jagan Mohan Reddy, Governor Narsimhan, YS Jagan, roja, GVL narsimha rao, chinarajappa, nara lokesh, YS Jagan srinivas rao, YS Jagan vishakapatnam airport attack, YSRCP, Vishakapatnam airport, YS Jagan injured, andhra pradesh, politics

YSRCP president and leader of the opposition YS Jagan has filed a writ petition, the Hyderabad High Court had postponed the hearing to november 6th.

వైఎస్ జగన్ పిటీషన్ నవంబర్ 6కు వాయిదా వేసిన హైకోర్టు

Posted: 11/01/2018 12:40 PM IST
Hc to hear ys jagan murder attempt case on nov 6

వైసీపీ అధినేత జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడిపై దాఖలు చేసిన పటిషన్ల విచారణను హైకోర్టు నవంబర్ 5కు వాయిదా వేసింది. దాడి ఘటనపై స్వతంత్ర సంస్థలో విచారణ చేయించాలంటూ జగన్ పిటిషన్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని, రాజకీయ కోణంలో విచారణ జరుగుతోందని పిటిషన్ లో జగన్ ఆరోపించారు. తనపై కుట్ర పూరితంగానే దాడి జరిగిందని... ఆ కోణంలో విచారణ జరిపించాలని ఆయన కోరారు.

మరోవైపు దాడికి సంబంధించి వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, అరుణ్ కుమార్ లు మరో రెండు పిటిషన్లు వేశారు. ఈ మూడు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు... తదుపరి విచారణను నవంబర్ 6కు (మంగళవారానికి) వాయిదా వేసింది. ఇదిలావుండగా జగన్ పై హత్యాయత్నం కేసు దర్యాప్తును వేగవంతం చేసిన సిట్ అధికారులు అత్యంత కీలక సాక్ష్యం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైఎస్ జగన్ ధరించిన చొక్కాను స్వాధీనం చేసుకునే అవకాశం కల్పించాలని విశాఖ పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ విషయాన్ని వెల్లడించిన విశాఖ పశ్చిమ ఏసీపీ ఎల్‌.అర్జున్‌, హత్యాయత్నం సమయంలో ధరించిన చొక్కాకు రక్తం అంటడంతో, జగన్‌ దాన్ని మార్చుకుని అక్కడి నుంచి వెళ్లారని గుర్తు చేశారు. కేసు విచారణలో ఆ షర్ట్ తమకు చాలా కీలక సాక్ష్యమని తెలిపారు. దాన్ని ఆధారంగా సమర్పించాల్సి వుందని గుర్తు చేశారు. ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు సెల్‌ఫోన్ల నుంచి కాల్‌ డేటాను విశ్లేషించగా, 321 మందితో పలుమార్లు మాట్లాడినట్లు వెల్లడైందని తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ysrcp  YS Jagan  chandrababu  High Court  CBI  Central police forces  crime  

Other Articles