hero shivaji slams bjp leaders వైసీపీ, బీజేపి నేతలపై మండిపడ్డ హీరో శివాజీ

Hero sivaji slams bjp leaders in a video from america

YS Jagan, Shivaji, Hero sivaji, operation garuda, operation dravida, bank defaulter, YS Jagan attack case, Srinivas rao, special investigative team police, womeniser, fusion food restaurant, Harsha, Red corner notice, BJP, TDP, andhra pradesh, politics

Hero shivaji who is presently in america says he came to america 54 times, center and foreign affairs ministry is in your hands, you can inquire on my America visit. He also responded on the rumors of red corner notice and said he is not a defaulter of banks.

వైసీపీ, బీజేపి నేతలపై మండిపడ్డ హీరో శివాజీ

Posted: 10/30/2018 12:30 PM IST
Hero sivaji slams bjp leaders in a video from america

అంధ్రప్రదేశ్ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు హీరో శివాజీ.. విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి జరిగిన ఘటన తరువాత ఆ పార్టీ నేతలతో పాటు కేంద్రంలోని అధికారంలో వున్న బీజేపి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో వున్న ఆయన అక్కడి నుంచి ఓ వీడియో ద్వారా స్పందిస్తూ.. ఆపరేషన్ గరుడ లో వున్నట్లుగానే అటు వైసీపీ, ఇటు బిజేపి నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

తన విషయానికి వస్తే తాను అపరేషన్ గరుడపై తనకున్న సమాచారాన్ని ఏడాది క్రితమే తాను వెలువరించానని చెప్పారు. వైసీపీ నేతలు ఇప్పుడు అందుకు అనుగూణంగానే నడుచుకుంటూ.. ఇప్పుడు భుజాలు తడుముకుంటున్నారో తెలియడం లేదని అన్నారు. వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు అపాలని హితవు పలికారు. అపరేషన్ గరుడను వైసీపీ నేతలతో పాటు ఇటు బీజేపి నేతలు కూడా కలసి బాగా రక్తి కట్టిస్తున్నారని శివాజీ ఎద్దేవా చేశారు.

అంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని అటు వైసీపీ నేతలు, ఇటు బీజేపి నేతలు తెరపైకి తెస్తున్నారని.. అసలు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవశ్యకత ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై యుద్దం చేయాల్సింది పోయి.. అధికారమే పరమావధిగా దాని గురించే అలోచిస్తున్న నేతలకు రాష్ట్ర ప్రగతి అక్కర్లేదా అని నిలదీశారు. తనను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాలని వైసీపీ నేతలు అంటున్నారని, తాను అపరేషన్ గరుడ గురించి చెప్పినపుడే వారు ఎందుకు డిమాండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు

ఇక బీజేపి నేతలు తనకు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలంటూ ఎవేవో మాట్లాడుతున్నారని, ప్రజల సోమ్మును దోచుకుని ఎంచక్కా కేంద్రమంత్రులకు సమాచారం అందించి మరీ విదేశాలకు వెళ్లిపోయిన అర్థక నేరగాడ్ని తాను కాదంటూ మరెందుకు తనకు రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలో తెలపాలని డిమాండ్ చేశారు. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు డబ్బులిచ్చి విదేశాలకు పంపారన్న అంటూ మరికోందరు విమర్శలు గుప్పిస్తున్నారని.. అసలు వారికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

అయితే ప్రజలకు మాత్రం తాను సమాధానం చెప్పాల్సి వుందని, తాను ఇప్పటివరకు 54 సార్లు అమెరికాకు వచ్చానని పేర్కోన్న హీరో శివాజీ.. అవసరం అనుకుంటే తన వీసాను, పాస్ పోర్టును కూడా చెక్ చేసుకోవచ్చని సవాలు విసిరారు. అంతేకాదు, కేంద్రం వైసీపీ చెప్పినట్టు వింటోంది కాబట్టి, ప్రధాని నరేంద్ర మోదీ వారికేం కావాలంటే అదే చేస్తున్నారు కాబట్టి.. విదేశీ వ్యవహరాల శాఖ కూడా కేంద్రంలోని అధికార బీజేపి చేతుల్లోనే ఉన్నందున.. అరోపణలు చేయడం ఎందుకు.. తమకు ఇష్టం వచ్చిన దర్యాప్తు చేసుకోవచ్చని శివాజీ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero sivaji  operation garuda  bank defaulter  Red corner notice  BJP  TDP  andhra pradesh  politics  

Other Articles