Petrol, diesel prices dip for the fifth straight day వరుసగా ఐదో రోజు తగ్గిన ఇంధన ధరలు

In a first diesel is costlier than petrol in odisha

Bhubhaneshwar, Car buying decision, crude oil price, diesel, Diesel Prices India, Fuel Price India, Fuel prices, global crude oil price, new car, Odisha, petrol, Petrol car or Diesel car, Petrol Prices India, Petrol vs diesel car, Rising Fuel Prices

As per the official data, diesel price has crossed the petrol price in Odisha, making it the first state in India to have diesel priced higher than petrol.

రికార్డుస్థాయికి డీజిల్ ధర.. దేశ చరిత్రలో తొలిసారిగా..

Posted: 10/22/2018 11:46 AM IST
In a first diesel is costlier than petrol in odisha

భారతదేశంలో ఇంధన ధరలు మరో ఘనతను సాధించాయి. దేశంలోని అన్ని రంగాలపై డీజీల్ ధర ప్రభావం స్పష్టంగా ప్రత్యక్షంగా చూపనున్న నేపథ్యంలో గత కొన్నేళ్ల క్రితం వరకు డీజిల్ పై సబ్సీడీని అందించిన ప్రభుత్వాలు.. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు దేశీయ మార్కెట్ పై ప్రభావం చూపుతున్న క్రమంలో ఇంధన ధరల నియంత్రణపై చేతులెత్తేసాయి. దీంతో యూపీఏ హయాంలో పక్షం రోజులకో పర్యాయం ధరల మార్పు కాస్తా.. ఎన్డీయే హయంలో రోజు వారీగా మార్పులు చెందాయి.

ఈ క్రమంలో కేంద్రంలోని నరేంద్రమోడీ హయంలో పలు పర్యాయాలు పెంచిన ఎక్సైజ్ సుంఖం ఏకంగా రూ.14 మేర పెరగ్గిన విషయం కూడా తెలిసిందే. ఇక అంతర్జాతీయంగా ధరలు పెరుతున్న క్రమంలో దేశంలో ఇంధన ధరలు కూడా అంతకంతకూ పెరుగుతూ.. అల్ టైం హైకి చేరి.. తమ రికార్డులను తామే చెరుపుకునే స్థాయికి కూడా చేరుకున్నాయి. అయితే వాహనదారుల సహనానికి పరీక్ష పెట్టిన కేంద్రం మాత్రం ఇంధన ధరలు శతకం వైపు పరుగులు తీస్తుంటే.. వాహనదారులకు ఉపశమనంగా రెంబు పర్యాయాలు ధరలను తగ్గించి ఎంతో చేశామన్న బిల్డప్ ఇస్తుంది.

ఇక ఈ నేపథ్యంలో దేశ చరిత్రలో తొలిసారిగా పెట్రోలు ధరను డీజిల్ అధిగమించింది. డీజిల్ ధరల ప్రభావం అటు నిత్యావసర సరుకులపై కూడా పడి బడుగు, బలహీన వర్గాలతో పాటు మధ్యతరగతి ప్రజలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపనున్న నేపథ్యంలో దేశంలో తొలిసారిగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఇది జరిగింది. ధరల నియంత్రణలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయలోపం కారణంగానే గతంలో ఎన్నడూ లేని ఈ పరిస్థితి వచ్చిందని వాహనదారులు విమర్శలు గుప్పిస్తున్నారు.

సాధారణంగా పెట్రోలు ధరతో పోలిస్తే, డీజిల్ ధర 10 శాతం వరకూ తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ, భువనేశ్వర్ లో ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ. 80.57కాగా, డీజిల్ ధర రూ. 80.69గా ఉంది. ఆయిల్ కంపెనీలపై పట్టు కోల్పోయిన కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే ఇటువంటి దయనీయ స్థితి ఏర్పడిందని ఒడిశా ఆర్థిక శాఖ మంత్రి శశిభూషణ్ బెహరా వ్యాఖ్యానించారు. మరోవైపు ఇంధన ధరలు వరుసగా ఐదవ రోజు కూడా స్వల్పంగా తగ్గాయి.

దీంతో ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో 30 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.81.34 ఉండగా.. డీజిల్ ధర 27 పైసలు తగ్గి రూ.74.92 కి చేరింది. ఇక దేశ అర్థిక రాజధాని ముంబైలోనూ 30 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.86.91 గా ఉంది. డీజిల్ ధర 28 పైసలు పెరిగి రూ.78.54 కి చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ.86.34, డీజిల్ ధర 30 పైసలు తగ్గి రూ.81.49 కి చేరింది.

విజయవాడలో పెట్రోల్ ధ‌ర రూ.85.41 ఉండగా.. డీజిల్ ధర రూ.80.15 గా కొనసాగుతోంది. కోల్‌కతాలో పెట్రోలు ధర 29 పైసలు, డీజిల్ ధర 27 పైసలు తగ్గింది. దీంతో పెట్రోలు ధర రూ.83.29 ఉండగా.. డీజిల్ ధర రూ.76.77 గా ఉంది. చెన్నైలో పెట్రోలు 32 పైసలు, డీజిల్ 29 పైసలు తగ్గింది. దీంతో అక్కడ పెట్రోలు ధర రూ.84.64 ఉండగా.. డీజిల్ ధర రూ.79.22 గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oil price  crude oil  price hike  petrol  diesel  dharmendra pradhan  gst  Bhubhaneshwar  

Other Articles