CBI Raids On Heera Group Offices హీరా ఇస్లామిక్ సంస్థ వ్యవహరాలపై సిబిఐ దర్యాప్తు

Cbi raids on heera group for allegedly cheating people with gold schemes

CBI Raids, Heera Group, heera Islamic University, Heera Offices at chandragiri, cheating people, gold schemes, Agri Gold, Heera Islamic foundation, chandragiri, andhra pradesh, crime

CBI Raids On Heera Group Offices at chandragiri for allegedly cheating people with gold schemes like Agri Gold. Even CBI is observing the issues taken up by Heera Islamic group on the other hand

హీరా గోల్డ్ చైర్మన్ నివాసం నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Posted: 10/17/2018 12:45 PM IST
Cbi raids on heera group for allegedly cheating people with gold schemes

అంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ తరహా మరో మోసం తాజాగా వెలుగుచూసింది. ప్రజలకు అరచేతిలో వైకుంఠాన్ని చూపి.. అధిక వడ్డీ ఆశను ఎరగా వేసి.. జనం నుంచి వేల కోట్లు దోచేసిన మరో సంస్థ భాగోతాన్ని పోలీసులు బయటపెట్టారు. చిట్టీలు, ఎక్కువ వడ్డీ చెల్లిస్తామంటూ జనాలను మభ్యపెట్టి దేశవ్యాప్తంగా వందల కోట్లు కొట్టేసిన హీరా గోల్డ్ సంస్థ ఛైర్మన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరేళ్ల కిందట హైదరాబాద్‌లోని ఆ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న హీరా గోల్డ్‌ ఛైర్మన్‌ షేక్‌ అలీమియా నౌహీరా బేగంను సీసీఎస్ పోలీసులు ఢిల్లీలో అరెస్ట్‌ చేశారు. అనంతరం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. దేశవ్యాప్తంగా వందల కోట్లు డిపాజిట్లు సేకరించి ఎగ్గొట్టిన ఈ సంస్థపై హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, ముంబైలతో పాటు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. మొత్తం 16 కంపెనీల పేర్లతో డిపాజిట్లు సేకరించి, భారీ మోసానికి పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు.. 160 బ్యాంకుల్లోని ఖాతాల ద్వారా ఈ లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ డిపాజిట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1999లోని సెక్షన్ 406, 409, 420, 506 కింద కేసులు నమోదు చేశారు. తొలిసారిగా 2012లో కేసు నమోదయ్యిందని.. నిదితురాలిపై కర్ణాటకలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని హీరా ఇస్లామిక్ సంస్థలోనూ సీసీఎస్ పోలీసులు, సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజకీయాల్లోకి వచ్చి ఆల్ ఇండియా మహిళా సాధికారికత పార్టీ పేరు రాజకీయ పార్టీని ప్రారంభించిన నౌహీరా, ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో పలువురికి టిక్కెట్లు ఇస్తానని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : CBI Raids  Heera Group  heera Islamic University  chandragiri  andhra pradesh  crime  

Other Articles