dhana lakshmi mata alankaram with rs 4.5 currency notes రూ.4.5 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ..

Vishaka kanyaka parameshwari devi in dhana lakshmi avatar with rs 4 5 cr currency notes

Kanaka Durga devi sharad navaratri, devi alankaram with Rs 4.5 cr currency notes, ammavaru with 4.5 currency notes, vishakapatnam, kanyaka pareshwari temple, vishaka traders association, vishaka temple comittes, devi alankaram, Mahalakshmi avataram, Dhana Lakshmi Avataram, Rs 4.5 cr currency notes, indrakeeladri, Alampur

As a part of Devi Sharad navaratri ustavam vishaka patnam kanyaka parameshwari temple commitee arranged mata in Dhana Lakshmi Avatar with Rs. 4.5 Crores and coins.

రూ.4.5 కోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ..

Posted: 10/15/2018 01:08 PM IST
Vishaka kanyaka parameshwari devi in dhana lakshmi avatar with rs 4 5 cr currency notes

శరన్నవరాత్రి వేడుకల్లో దుర్గాదేవి అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంటారు. పరమేశ్వరి, పార్వతి, గాయత్రి, మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, కనకదుర్గ, లలిత, రాజరాజేశ్వరి.. ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయా రూపాల్లో ఉండే ‘పరాశక్తి’ ఒక్కటే. దేశ వ్యాప్తంగా దుర్గాదేవి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో అవతారంతో అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తుంటారు. ప్రతి అమ్మవారి ఆలయంలోనూ ఈ శరన్నవరాత్రి వేడులు ఘనంగా జరుగుతాయి.

వాస్తవానికి శరన్నవరాత్రిలు అంటే తెలుగు రాష్ట్రాల్లో మనకు ముందుకుగా గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయమే. అయితే విశాఖపట్నంలోని కురుపాం మార్కెట్ ప్రాంతంలో ఉన్న కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది 100 ఏళ్ల క్రితం నాటి ఆలయం. ఈ ఆలయంలోనూ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు పట్టుచీర, సుమారు రూ.4.5 కోట్ల నగదుతో అలంకరించారు. అలాగు 4 కిలోల బంగారు ఆభరణాలు అమ్మవారికి అలంకరించారు.

అమ్మవారికి అలంకరించిన నగదులో రూపాయి నుంచి రూ.2 వేల వరకు నోట్లు, నాణేలు ఉన్నాయి. బంగారు ఆభరణాలు, చీరతోపాటు బంగారు బిస్కెట్ల నడుమ అమ్మవారిని కొలువుతీర్చారు. నగరంలో ఉన్న 200 మంది భక్తులు ఈ అభరణాలను సమకూర్చారు. కాగా, అమ్మవారికి అలంకరించిన నగదును పేద ప్రజలకు ఆలయ కమిటీ అందజేయనుందని సమాచారం. ఇక అమ్మవారి వద్దనున్న నాణేలను మాత్రం భక్తులకు తలా ఒకటిగా వితరణ చేయనున్నారని తెలుస్తుంది. ప్రతీ ఏటా ఇలానే చేస్తారని కూడా సమాచారం. అయితే దీనిపై ఆలయ కమిటీ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles