Pawan warns mla chintamaneni తీరుమార్చుకోమ్మని చింతమనేనికి పవన్ వార్నింగ్

Pawan kalyan warns denduluru mla chintamaneni

pawan kalyan, janasena, pawan kalyan porata yatra, pawan kalyan eluru, pawan kalyanwest godavari district, pawan kalyan Eluru, eluru yatra, Pawan Kalyan chintamaneni prabhakar, Pawan Kalyan dalit sangh meet, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan warns west godavari district denduluru mla chintamaneni prabhakar for man handling dalit worker.

చింతమనేని.. తీరు మార్చుకో: పవన్ కల్యాణ్ హెచ్చరిక..

Posted: 09/25/2018 08:09 PM IST
Pawan kalyan warns denduluru mla chintamaneni

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి ఎన్నికల సమరంలోకి అడుగుపెడుతున్న క్రమంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర పర్యటన చేసిన ఆయన.. ఇక ఇప్పుడు కోస్తాంధ్రలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగరంలోని క్రాంతి కల్యాణమండపంలో పవన్ కల్యాణ్ పలు వర్గాలు, సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ముందుగా ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యులతో పవన్ భేటీ అయ్యారు. డ్రైవర్ల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు.

తన ఫోటోను ఆటోలపై పెట్టుకున్న డ్రైవర్లను కొంతమంది నేతలు వేధిస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని.. ఈ విషయంలో డ్రైవర్లు సంయమనం పాటించాలన్నారు. జనసేన అధికారంలోకి వస్తే.. సబ్సిడీపై బ్యాటరీ ఆటోలు అందజేస్తామన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మగౌరవం కాపాడతామని.. వారి సమస్యల్ని కూడా పరిష్కరిస్తామన్నారు.ఆ తరువాత ఆలిండియా దళిత హక్కుల సంఘం నేతలు, హమాలీలతో పవన్ భేటీ అయ్యారు.

ధళితుల సమస్యల్ని కూలంకుషంగా అలకించిన ఆయన.. ఈ క్రమంలో దళితుడిపై దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేసిన ఘటనపై స్పందిస్తూ.. దానిని తీవ్రంగా ఖండించారు. చింతమనేని తీరు రౌడీషీటర్‌ను తలపిస్తోందని.. ఆయన్ను సీఎం అదుపు చేయకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు దళిత తేజం కార్యక్రమం నిర్వహిస్తున్నా..దళిత, మురికి వాడల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు పక్కదోవ పట్టడంతో దళితవాడల్లో అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు పవన్.

పవన్ ను వికలాంగులు కూడా కలిశారు. ఈ సందర్భంగా వికలాంగులు తమ సమస్యల్ని జనసేనానికి చెప్పుకున్నారు. వికలాంగులకు కూడా సొంత ఇల్లు ఉండాలని.. వారిపై ఆధారపడి ఉండే కుటుంబ సభ్యులకు కూడా పెన్షన్ ఉండాలని అభిప్రాయపడ్డారు పవన్. అనంతరం పాస్టర్ల సంఘం సభ్యులు జనసేనానిని కలిశారు. జనసేన అధినేతకు తమ ఆశీస్సులను అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు తమ సమస్యల్ని పవన్‌కు విన్నవించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  west godavari  chintamaneni prabhakar  dalit sangh  andhra pradesh  politics  

Other Articles